ఎమ్మెల్సీ సీటు కోసం బీజేపీలో పోటీ

ఎమ్మెల్సీ సీటు కోసం బీజేపీలో పోటీ

గట్టిగా ట్రై చేస్తున్న హైదరాబాద్‌‌, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌ నేతలు

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీలో పోటీ పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని పట్టభద్రులు బీజేపీకి అనుకూలంగా ఉండటం, మహబూబ్‌‌నగర్ వంటి జిల్లాలోనూ బీజేపీ వైపు యూత్‌‌ ఆకర్షితులవడంతో పార్టీకి సానుకూలత ఉందని గ్రహించిన సిటీ నేతలతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్ జిల్లాల పార్టీ రాష్ట్ర నేతలు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సిటీ పార్టీ ప్రెసిడెంట్ రాంచందర్‌‌రావు మళ్లీ పోటీకి సిద్ధమవుతుండగా తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు పార్టీ ముఖ్యులను కలిసి కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎస్. మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తనను కాదని రాంచందర్‌‌రావుకు ఇచ్చారని, ఈసారైనా తనకు ఇవ్వాలని పార్టీ ప్రముఖులను కలిసి కోరారు. రాంచందర్‌‌రావుకు జాతీయ, రాష్ట్ర బీజేపీ నేతలతో ఉన్న మంచి సంబంధాల వల్ల మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ పదవి, ఎమ్మెల్సీ పదవి, గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌‌ కూడా రాంచందర్‌‌రావుకే ఇచ్చారని, ఒక్కరికే అన్ని అవకాశాలిస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

For More News..

పూర్తైన డిగ్రీ ఫస్ట్‌ఫేజ్ సీట్ల కేటాయింపు

ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా పదిసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఆంగ్ రీటా మృతి

మద్దతు ధర పెంచిన కేంద్రం.. ఏ పంటకు ఎంతంటే..

Latest Updates