కరోనా మందును కనిపెట్టే పనిలో కంపెనీల పోటీ

  • జోరుగా వ్యాక్సిన్​ రేస్
  • రేసులో ముందున్న మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్​
  • మనుషులపై ఫస్ట్​ ఫేజ్​ క్లినికల్​ ట్రయల్స్​ సక్సెస్​
  • యాంటీ బాడీలను పుట్టించిన ఎంఆర్​ఎన్​ఏ1273 వ్యాక్సిన్​

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ రేస్​ జరుగుతోంది. అది కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టే రేస్​. ఒకటి కాదు.. రెండు కాదు.. 118 వ్యాక్సిన్​ క్యాండిడేట్లు లైన్​లో ఉన్నాయి. అందులో 8 క్లినికల్​ ట్రయల్స్​ దశకు వచ్చేస్తే.. ఇంకో 110 క్యాండిడేట్లు ప్రి క్లినికల్​ ట్రయల్స్​ దశలోనే ఉన్నాయి. మరి, ఆ రేసులో ప్రస్తుతం దూసుకుపోతున్న వ్యాక్సిన్లేంటి? అంటే సైంటిస్టుల నోటి నుంచి వస్తున్న మాట అమెరికాలోని మోడెర్నా అనే కంపెనీ తయారు చేస్తున్న ‘ఎంఆర్​ఎన్​ఏ1273’ అనే వ్యాక్సిన్​ క్యాండిడేట్​ గురించే. ఆక్స్​ఫర్డ్​ తయారుచేసిన చేడాక్స్​1ఎన్​కోవ్​19.. దాని వెనకే ఉంది.

మోడెర్నా క్లినికల్​ ట్రయల్స్​ సక్సెస్​

ప్రస్తుతం మోడెర్నా వ్యాక్సిన్​ ఎంఆర్​ఎన్​1273 వ్యాక్సిన్​ మంచి ఫలితాలనిచ్చినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఈమధ్యే అది మొదటి దశ క్లినికల్​ ట్రయల్స్​ను పూర్తి చేసుకుంది. 8 మంది వలంటీర్లపై దానిని టెస్ట్​ చేయగా వాళ్లలో కరోనాతో పోరాడే యాంటీబాడీలు పుట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి మనుషుల్లో పాజిటివ్​ రిజల్ట్​ వచ్చిన వ్యాక్సిన్​ ఇదొక్కటేనని బ్రిటన్​కు చెందిన ఇన్​ఫెక్షియస్​ డిసీజ్​ అనలిటిక్స్​ అండ్​కన్సల్టింగ్​ కంపెనీ అసోసియేట్​ డైరెక్టర్​ మైకేల్​ బ్రీన్​ చెప్పారు. మార్చిలో అమెరికాకు చెందిన నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ అలర్జీ అండ్​ ఇన్​ఫెక్షియస్​ డిసీజ్​ (ఎన్​ఐఏఐడీ) ఆధ్వర్యంలో క్లినికల్​ ట్రయల్స్​ మొదలుపెట్టింది మోడెర్నా. దాదాపు 45 రోజుల పాటు ట్రయల్స్​ సాగాయి. ఈ స్టడీలో వలంటీర్లపై ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ లేవని తేలింది. అంతేకాదు, కరోనా వైరస్​పై పోరాడే యాంటీ బాడీలూ తయారయ్యాయి. ఫస్ట్​ ట్రయల్స్​లో మోడెర్నా వ్యాక్సిన్​ పనితీరు బాగుందని కోల్​కతాలోని సీఎస్​ఐఆర్​ ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ బయాలజీ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉపాసనారే చెప్పారు.

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​

మోడెర్నా తర్వాత అంత వేగంగా ట్రయల్స్​ జరుగుతున్న వ్యాక్సిన్​ ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన చేడాక్స్​1ఎన్​కొవ్​19. కొద్ది రోజుల క్రితం కోతులపై చేసిన టెస్టులు సక్సెస్​ అయ్యాయి. అక్టోబర్​ కల్లా వ్యాక్సిన్​ తెస్తామని యూనివర్సిటీ ప్రకటించింది. వ్యాక్సిన్​ ప్రొడక్షన్​ పనులూ మొదలయ్యాయి. మన దేశానికి చెందిన సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా, బ్రిటన్​కు చెందిన ఆస్ట్రా జెనికాలు ప్రొడక్షన్​కు ఒప్పందం చేసుకున్నాయి. అది మెచ్చుకోదగిన విషయమే అయినా,  వ్యాక్సిన్​పై మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందని ఉపాసన రే అన్నారు. కోతులపై బాగానే పనిచేసినా మనుషులపైనా ట్రయల్స్​ వేగం పెంచాల్సిన అవసరం ఉందని మైకేల్​ బ్రీన్​ అభిప్రాయపడ్డారు. మోడెర్నా ఎంఆర్​ఎన్​ఏ1273 వ్యాక్సిన్​ తర్వాత, మంచి ఫలితాలిస్తున్న వ్యాక్సిన్​ ఇదేనన్నారు. ఇవి కాకుండా ఇండియాకు చెందిన 8 సంస్థలూ వేరే వ్యాక్సిన్లపై పనిచేస్తున్నాయి. చైనాకు చెందిన సినోవ్యాక్​ బయోటెక్​ కంపెనీ పికోవ్యాక్​ అనే వ్యాక్సిన్​ క్యాండిడేట్​పై పరిశోధనలు చేస్తోంది.

ఇండియాలో గిలీడ్​ డ్రగ్​

అమెరికా ఫార్మా కంపెనీ గిలీడ్​ సైన్సైస్​ రెమ్డెసివిర్​పై పరిశోధనలు చేసి సక్సెస్​ అయిందన్న సంగతి తెలిసిందే. ఆ మందును ఇండియాలోనూ అమ్మేందుకు కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు సెంట్రల్​ డ్రగ్స్​ స్టాండర్డ్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్​(సీడీఎస్​సీవో)కు త్వరలోనే దరఖాస్తు చేయబోతోందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కంపెనీ ప్రతినిధులతో డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ), కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చర్చించినట్టు అధికారులు చెబుతున్నారు. కంపెనీ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​తో చర్చించిన తర్వాత ఇండియాలో రెమ్డెసివిర్​ మందు అమ్మకంపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రతనిధులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ మందుగా దానిని వాడేందుకు అమెరికా ఎఫ్​డీఏ ఇప్పటికే అనుమతిచ్చింది. యూఎస్​ఎఫ్​డీఏ లాంటి ఓ పెద్ద సంస్థ మందుకు అనుమతి ఇచ్చింది కాబట్టి, క్లినికల్​ ట్రయల్స్​ లేకుండానే ఇండియాలో దానిని మార్కెట్​ చేసేందుకు అనుమతిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యూ డ్రగ్​ అండ్​ క్లినికల్​ ట్రయల్​ రూల్స్​ 2019లోని కొన్ని ప్రొవిజిన్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. దేశంలోని సిప్లా, జుబిలెండ్​ లైఫ్​సైన్సెస్​, హెటిరో వంటి కంపెనీలతో మందును తయారు చేసేందుకు గిలీడ్​ ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​కు 40 కోట్ల డోసుల ఆర్డర్​

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ తయారు చేస్తున్న వ్యాక్సిన్​కు ఆస్ట్రాజెనికా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముందడుగు వేసింది కంపెనీ. అమెరికాకు చెందిన బయోమెడికల్​ అడ్వాన్స్​డ్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ.. కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 40 కోట్ల వ్యాక్సిన్​ డోసులకు ఆర్డర్​ పెట్టింది. ఈ డీల్​ విలువ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు) పైమాటే. ఒప్పందలో భాగంగా వ్యాక్సిన్​ అభివృద్ధి, ఉత్పత్తి, డెలివరీ చేయనుంది కంపెనీ.

వ్యాక్సిన్​ సక్సెస్​ రేట్​ సగమే

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ ట్రయల్స్​ ప్రాజెక్ట్​ లీడర్​

లండన్​: కొద్ది రోజుల కిందట అక్టోబర్​ కల్లా వ్యాక్సిన్​ తెస్తామని ధీమాగా చెప్పింది ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ. కోతులపై ట్రయల్స్​ సక్సెస్​ అయ్యాయి కూడా. మనుషులపై మొదటి విడత ప్రయోగాలూ మొదలుపెట్టింది. పది వేల మందిపై పెద్ద సంఖ్యలో స్టడీ స్టార్ట్​ చేసింది. కానీ, ఆ ట్రయల్స్​ ప్రాజెక్ట్​ను లీడ్​ చేస్తున్న సైంటిస్టు మాత్రం ఓ పెద్ద బాంబు పేల్చారు. వ్యాక్సిన్​ సక్సెస్​ అయ్యే చాన్స్​ 50 శాతం మాత్రమేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చేడాక్స్​1ఎన్​కొవ్​19 వ్యాక్సిన్​పై ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీకి చెందిన జెన్నర్​ ఇనిస్టిట్యూట్​ ట్రయల్స్​ చేస్తోంది. ఆ ఇనిస్టిట్యూట్​ డైరెక్టర్​, వ్యాక్సిన్​ ట్రయల్స్​ ప్రాజెక్ట్​ లీడర్​ ఆడ్రియన్​ హిల్​.. వ్యాక్సిన్​ సక్సెస్​పై షాక్​ ఇచ్చారు. 10 వేల మందిపై త్వరలోనే వ్యాక్సిన్​ ట్రయల్స్​ మొదలుపెట్టబోతున్నామని, అయితే, అందులో కరోనా సోకినోళ్లు తక్కువగా ఉండడం వల్ల వ్యాక్సిన్​ సక్సెస్​ అయ్యే చాన్సెస్​ చాలా తక్కువని, కాలంతో పరుగులు తీస్తూ కరోనాను చంపేసేందుకు వ్యాక్సిన్​పై ప్రయోగాలు చేస్తున్నామన్నారు.

మహారాష్ట్రలో మరో సాధువు హత్య

Latest Updates