సీఎం కేసీఆర్, మంత్రులపై ఫిర్యాదు

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ముఖ్యమంత్రి  కేసీఆర్ తో పాటు మంత్రులను బాధ్యులను చేస్తూ… కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ. సమ్మెలో ఉన్న కార్మికుల అందరి ఉద్యోగాలు పోయినట్లేనని సీఎం అనడం.. మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడటం కారణంగానే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు. ఘటనకు బాధ్యులుగా సీఎం కేసీఆర్, రవాణామంత్రి పువ్వాడ అజయ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ పై కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 

Latest Updates