ముదురుతున్న గాడ్సే వివాదం: నాగబాబుపై కేసు నమోదు

మెగ్రా బ్రదర్ నాగబాబు పై కేసు నమోదైంది. నాథు రామ్ గాడ్సే  జన్మదినం సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడని పొగుడుతావా అంటూ చాలామంది నెటిజన్లు నాగబాబును తప్పుబట్టారు. దాంతో ఆయన స్పందిస్తూ  దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాథురాం గాడ్సే గురించి ఇచ్చిన ట్వీట్ లో నాథురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాథురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వాళ్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం అని పేర్కొన్నారు.

తాజాగా నాగబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నాగబాబుకు మతిభ్రమించింది. ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలి. మానసిక స్థితి బాగాలేకపోవడంతోనే ట్విటర్‌లో గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని కొనియాడారు అని అన్నారు.

Latest Updates