రియ‌ల్ట‌ర్ న‌ర్సింహ‌రెడ్డి ఇంట్లో చోరీ.. కుషాయిగూడ పీఎస్ లో ఫిర్యాదు

మల్కాజిగిరి: కు‌షాయిగూడకు చెందిన రియ‌ల్ట‌ర్ న‌ర్సింహారెడ్డి ఇంట్లో చోరీ జ‌రిగిన‌ విష‌య‌మై కుషాయిగూడ పీఎస్ లో ఫిర్యాదు న‌మోదైంది. త‌న కొడుకు పెళ్లి సంద‌ర్భంగా షిర్డీ వెళ్లి వ‌చ్చే స‌రికి ఇంట్లోని విలువైన వ‌స్తువులు చోరీకి గుర‌య్యాయ‌ని న‌ర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1.73 కేజీల బంగారం, 2 లక్షల నగదు, ఎల‌క్ట్రానిక్ వస్తువులు మొత్తం 2 కోట్లు విలువైన సొత్తు పోయినట్లు త‌న ఫిర్యాదు లో పేర్కొన్నాడు.

ఈ చోరీ విష‌య‌మై మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ.. న‌ర్సింహారెడ్డి ఇంట్లో ప‌ని చేసే వ్య‌క్తే ఈ దొంగ‌త‌నం చేసిన‌ట్టు ఆమె తెలిపారు. నేపాల్ కు చెందిన ఆ వ్యక్తి గ‌త 6 నెలలుగా న‌ర్సింహారెడ్డి ఇంట్లో పనిచేస్తున్నాడ‌ని.. అతనే ఈ చోరీ చేసినట్లు తెలుస్తోంద‌న్నారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో చోరీ జరిగినట్టు తెలుస్తోందని. .ఇప్పటికే సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

మొత్తం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్ పోర్ట్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. వీలైనంత తొందర లో నిందితులను పట్టుకుంటామ‌న్నారు. ఏదేమైనా.. ప‌నిలో పెట్టుకొనే ముందు కొత్త పని మనుషుల గురించి తెలుసుకొని.. ఆ త‌ర్వాతే పనిలో పెట్టు కోవాలని డీసీపీ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Latest Updates