
హైదరాబాద్: కరోనా టెస్ట్ పేరుతో కాలాయాపన చేయడం వల్లే తమ తోటి విద్యార్ధి మరణించాడంటూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పై పీఎస్ లో ఫిర్యాదు చేశారు హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ విధ్యార్ధి సంఘం నాయకులు.
యూనివర్శిటిలో PhD చేస్తున్న సూర్యప్రతాప్ అనే విద్యార్ధి ఈ నెల 17న తేదీ అనారోగ్యంతో శేరిలింగంపల్లిలోని సిటిజన్ హాస్పిటల్ లో చేరాడు. అయితే అక్కడి హాస్పిటల్ మేనేజ్మెంట్… హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడానికి ముందు సుర్య ప్రతాప్ కు కరోనా టెస్ట్ నిర్వహించాలని తెలిపింది. టెస్ట్ లు చేయగా.. మొదటి రోజు కరోనా నెగిటివ్ అని చెప్పి.. మరో రోజు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించకుండా కాలయాపన చేసిందన్నారు అతని తోటి విద్యార్ధులు. దీంతో గచ్చిబౌలి లోని మరో హాస్పిటల్ కి తరలించగా అక్కడ కరోనా నెగిటివ్ రావడంతో అక్కడి వైద్యులు చికిత్స అందించగా… సూర్య ప్రతాప్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో సిటిజన్ వైద్యుల నిర్లక్ష్యంతోనే సూర్యప్రతాప్ చనిపోయాడని యునివర్సిటీ విద్యార్ధి సంఘం నాయకులు చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఆ హాస్పిటల్ పై ఫిర్యాదు చేశారు .