‘సాహో’లో మా బ్యాగ్ చూపించలేదు.. UV క్రియేషన్స్‌పై ఫిర్యాదు

సాహో సినిమా ప్రొడ్యూసర్స్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బెంగుళూరుకు చెందిన ఔట్ షైనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు. సినిమాలో తమ బ్యాగ్ ను ప్రమోట్ చేస్తాం అని ప్రొడ్యూసర్స్ వంశీ, ప్రమోద్, విక్రమ్ అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత దానిని పట్టించుకోలేదని ఆరోపించారు. తమ కంపనీకి చెందిన ఆర్టిటిక్ ఫాక్స్ అనే బ్యాగ్ ను సాహో సినిమాలో ప్రమోట్ చేస్తామని.. రూ.37 లక్షల అగ్రిమెంట్ చేసుకున్నారని.. కానీ సినిమాలో చూపించలేదని పిటిషన్ లో చెప్పారు. ఈ కారణంగా..  తమకు, కంపనీకి రూ.కోటి 39 లక్షలు నష్టం వచ్చిందని అన్నారు.

ఈ కంప్లయింట్ పై మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి స్పందించారు. ఔట్ షైనీ అనే కంపెనీ బ్యాగ్ ను సాహో సినిమాలో వాడుతామని చెప్పి మోసం చేశారంటూ కంప్లయింట్ వచ్చిందన్నారు. ఆర్కిటిక్ ఫాక్స్ బ్యాగ్ ను సాహో సినిమాలో హీరో, హీరోయిన్ చేత ప్రమోట్ చేస్తామని యూవీ క్రియేషన్స్ రూ. 37 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుందన్నారు. న్యాయ సలహాలు తీసుకుని కేసులో విచారణ చేస్తామని చెప్పారు.

Latest Updates