స్పెషల్ క్లాసులపై కేటీఆర్ కు ఫిర్యాదు

కరోనా నియంత్రణకు అన్ని విద్యాసంస్థల్ని మార్చి 31 వరకు బంద్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి కొన్ని ప్రైవేట్ స్కూళ్లు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. ఇదే విషయాన్ని కొందరు తల్లిదండ్రులు…ట్విటర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రైవేట్ స్కూళ్లలోని టీచర్లను రోజూ రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు వివరించారు. కొన్ని స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సూచనలు చేశారు. విద్యాసంస్థలన్నింటిని పూర్తిగా మూసేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Latest Updates