మొక్కను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్: ఇంటి ముందు పెంచుకున్న మొక్కను దొంగింలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంటి యజమాని. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఇంటి ముందు బోన్సాయ్ మొక్కను ఈ నెల 12 న ఎవరో దొంగిలించారని మాజీ ఐపీఎస్ అధికారి అప్పారావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు..వారి దగ్గర్నుంచి బోన్సాయ్ మొక్కను రికవరీ చేశామని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇంటి అవరణలో వున్న చెట్టును దొంగిలించిన ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు.

 

Latest Updates