ఇవాళ్టి నుంచి బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్

భారత దేశంలో  కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరుగుతుంది. దీంతో ఇవాళ్టి(మంగళవారం) నుంచి దేశంలోని అనేక నగరాల్లో లాక్‌డౌన్‌ మళ్లీ అమలు చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ సాయంత్రం నుంచి ఈనెల 22 వరకు రాజధాని బెంగళూరుతోపాటు దానిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు, కిరాణా దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కర్ణాటకలో నిన్న ఒక్క రోజే 2,738 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 41,581కి పెరిగింది. ఇప్పటి వరకు 757 మంది చనిపోయారు. ఇంకా 25 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Latest Updates