14 నుంచి బెంగళూరులో పూర్తి లాక్ డౌన్

కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ప్రతి రోజు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల(జులై) 14వ తేదీ నుంచి (జులై) 23 వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 14వ తేదీ రాత్రి 8 గంటలకు లాక్ డౌన్ మొదలవుతుందని… 23వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది.  దీనికి సంబంధించి  సీఎం కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించింది. అవసరం లేకున్నా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Latest Updates