గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి: సీపీ

వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయినట్లు చెప్పారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. మొత్తం 17 రహదారుల్లో శోభాయాత్ర ఉంటుందన్నారు. 10వేల లారీల్లో గణపయ్యలను తరలించే అవకాశం  ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 12 ఉదయం 9గంటల నుంచి  ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Latest Updates