కాళేశ్వరం స్ఫూర్తితో మిగిలిన ప్రాజెక్టులూ పూర్తి చేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుండడంపై సీఎం కేసీఆర్ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం స్పీడ్ గా పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను సీఎం అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల దగ్గర పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు.

మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని సీఎం కేసీఆర్ ఇవాళ(మంగళవారం) సందర్శించారు. సతీమణి శోభ, మంత్రులు,ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు సీఎం కేసీఆర్.

Latest Updates