ఫండ్స్​ ఇయ్యకున్నా పనుల్జేయాలె.. సర్పంచులపై ఆఫీసర్ల ఒత్తిడి

సీఎస్​ ఆదేశంతో కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్న కలెక్టర్లు

చేసిన పనులకు బిల్లులు అడుగుతున్న సర్పంచులు
ఎప్పుడు ఫండ్స్ వస్తాయో చెప్పలేకపోతున్న ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు: నిధులు ఇయ్యకుండానే పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటూ సర్పంచులపై ఆఫీసర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈజీఎస్​ స్కీంలో భాగంగా ఊరూరా నిర్మాణంలో ఉన్న శ్మశానవాటికలు,  పంట నూర్పిడి కల్లాలు, సెగ్రియేషన్ షెడ్లు, రైతు వేదికలు, విలేజ్​పార్కులు వెంటనే కంప్లీట్​ చేయాలని కలెక్టర్లను తాజాగా సీఎస్​ ఆదేశించారు. పనులన్నీ పూర్తిచేయాల్సిన  బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. కానీ సర్కారు నుంచి ఫండ్స్​ రాక గ్రామాల్లో పనులు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. సర్పంచులను ఒత్తిడి చేస్తే ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అడుగుతున్నారు. దీంతో మరోమార్గం లేక కలెక్టర్లు డివిజన్ లెవల్ మీటింగులు పెడుతున్నారు. ఈ మీటింగులకు సర్పంచులను పిలిస్తే ఫండ్స్​ కోసం నిలదీస్తారని  భావించి కింది స్థాయి ఆఫీసర్లకు టార్గెట్లు పెట్టి ఉరికిస్తున్నారు. కానీ ఫండ్స్ ఎప్పుడు వస్తాయనే విషయం గురించి ఎవరూ నోరు విప్పడం లేదు. దీంతో అసలు సర్కారు నిర్దేశించిన పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

ఫండ్స్​ లేక ఆగిపోయిన పనులు..

స్టేట్​లో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ఈజీఎస్​ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా శ్మశానవాటికలు,  పంట నూర్పిడి కల్లాలు, సెగ్రియేషన్ షెడ్లు, రైతు వేదికలు, విలేజ్​పార్కులు ఏర్పాటుచేయిస్తోంది. ఈ బాధ్యతలను సర్పంచులు, కార్యదర్శులపై పెట్టింది. ఒక్కో శ్మశానవాటికకు రూ.12 లక్షలు, డంపింగ్ యార్డు కు రూ.2.50లక్షలు, విలేజ్​ పార్కుకు రూ. 5.7లక్షల చొప్పున మంజూరు చేస్తోంది. ఇవిగాక ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,604 క్లస్టర్ల పరిధిలో  రైతువేదికలను నిర్మిస్తుండగా, రూ.22 లక్షల చొప్పున మంజూరు ఇచ్చారు. సర్పంచులు అప్పుసప్పు చేసి పనులు చేస్తుండగా, ఇప్పటివరకు రైతువేదికలకు మాత్రమే ఫస్ట్​ పేజ్​ ఫండ్స్ రిలీజ్ చే శారు. మిగిలిన వా టికి ఫండ్స్ ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రైతు వేదికలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టిన సర్కారు వాటిని పూర్తిచేసేవరకు  ఆఫీసర్లను వదిలిపెట్టలేదు. దాదాపు 90శాతం పనులు కంప్లీట్ చేసినప్పటికీ ఫండ్స్ మాత్రం ఇంకా పెండింగ్​లో ఉన్నాయి. వర్క్స్ కం ప్లీట్ చేసిన సర్పంచులు, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షి ణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పెండింగ్​లో ఉన్న మిగిలిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చే సింది.  చేసిన పనులకే డబ్బులు రాక సర్పంచులు గొడవ చేస్తున్న నేపథ్యంలో మళ్లీ వాళ్లతో మిగిలిన పనులు చేయించడం ఆఫీసర్లకు తలకుమించిన భారమవుతోంది.

రూటు మార్చిన ఆఫీసర్లు..

ఈజీఎస్ వర్క్స్ స్టార్ట్ చేసినప్పుడు  స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి హంగామ చేసిన ఆఫీసర్లు ప్రస్తుతం రూటు మార్చారు. కల్లాలు, శ్మశానవాటికలు, సెగ్రియేషన్ షెడ్లు, రైతు వే దికలు, విలేజ్​పార్కుల పురోగతికి సంబంధించి డివిజన్ లెవల్ మీటింగులు పెడుతున్నారు. ఈ మీటింగులకు సర్పంచ్​లను పిలిస్తే పెండింగ్ బిల్లు ల గురించి నిలదీస్తారని,  కిందిస్థాయి స్టాఫ్​తో రివ్యూలు చేస్తున్నా రు. ఫండ్స్ గురించి చర్చ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాస్తవ పరిస్థితులు కింది స్థాయి ఆఫీసర్లకు తెలిసినప్పటికీ నోరుమెదపడం లేదు. జిల్లా ఆఫీసర్లు సైతం ఫండ్స్ సమస్య గురించి  పై ఆఫీసర్లకు చెప్పలేకపోతున్నారు. ఫండ్స్ గురించి ఎవరికి వా రు తప్పించుకునే దోరణి అవలంబిస్తున్నారు. కానీ పెండింగ్ వర్క్స్ మా త్రం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఫీల్డ్ స్టాఫ్​కు టార్గెట్ పెడుతున్నా రు. సర్పంచులు ఎవరైనా పేచీ పెడితే సర్కారు సబ్సిడీ ఇస్తున్నందున బిల్లుల కోసం మార్చి వరకు  ఎదురుచూడక తప్పదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆఫీసర్లకు సలహా ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సర్పంచులకు నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే మంజూరు చేసిన పనులను క్యాన్సల్ చేస్తామని చెప్పి పనులు చేయించాలని సూచిస్తున్నారు.

రైతు వేదికలు ఫస్ట్… మిగతావి లాస్ట్
ఫండ్స్​తో సంబంధం లేకుండా ఆఫీసర్ల మీద నమ్మకంతో అన్ని జిల్లాలో దాదాపు రైతువేదికలు కంప్లీట్ చేశారు. కానీ ఇతర పనులన్నీ ఫండ్స్ లేక ఎక్కడికక్కడే ఆపేశారు. పనుల సాంక్షన్ ఇచ్చినంత వేగంగా వాటిని చేపట్టడంలో మాత్రం ఫెయిలయ్యారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో పంట కల్లాల టార్గెట్ 8,280 కాగా, 6,908 సాంక్షన్ ఇచ్చారు. దీంట్లో గ్రౌండింగ్ 2,668 కాగా, ఇప్పటికీ 215 మాత్రమే కంప్లీట్ చేశారు. అలాగే శ్మశాన వాటికలు 838 సాంక్షన్ చేయగా 797 ప్రోగెస్ లో ఉన్నాయి. 12 కంప్లీట్ చేశారు. సెగ్రియేషన్ షెడ్లు 834 సాంక్షన్ చేయగా 3 మాత్రమే కంప్లీట్ చేశారు. అదే రైతు వేధికలకు వచ్చే సరికి 136 సాంక్షన్ ఇవ్వగా 90శాతం వర్క్స్ కంప్లీట్ చేశారు.

For More News..

భూమి లాక్కోవద్దంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం

జీహెచ్ఎంసీ బడ్జెట్​ కొండంత.. ఖర్చు గోరంత

వీధి వ్యాపారుల లోన్లపై బల్దియా నిర్లక్ష్యం

Latest Updates