హైదరాబాద్ 1031 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు

లోకసభ ఎన్నికలలో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాలలోని సమస్యాత్మక పోలింగ్‍ స్టేషన్లపై రిటర్నింగ్​ అధికారులు దృష్టిసారించారు. అధికారులు, రెవెన్యూ సిబ్బందితో ఇప్పటి కే సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సీట్ల పరిధిలోని క్లిష్టమైన, సమస్యాత్మకమైన పోలింగ్​ కేంద్రాలను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈరెండింటిలో మొత్తం14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలో19,57,772 ఓటర్లు ఉండగా పురుషులు10,12,369, మహిళలు 9,45,271,ఇతరులు 132 మంది ఉన్నారు.

సికింద్రాబాద్పరిధిలో మొత్తం 19,68,147 మంది ఓటర్లుఉండగా పురుషులు 10,24,917, మహిళలు9,43,171, ఇతరులు 59 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అయితేగత అసెంబ్లీ ఎన్నికలలో పాతబస్తీతోపాటు పలుప్రాంతాలలో చాలామంది ఓట్లు గల్లంతయ్యాయి. ఓటింగ్​ శాతం కూడా ఇతర జిల్లాల కంటేనగరంలో తక్కువగా నమోదైంది. మరోవైపుజిల్లాలోని హైదరాబాద్ లోక్ సభ పరిధిలోకార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహుదుర్ పురా,సికింద్రాబాద్ పరిధిలో నాంపల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ముషీరాబాద్, అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో సమస్యాత్మక పోలింగ్​కేంద్రాలు ఎక్కువగానే ఉన్నాయి. వీటిని గతఅసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అధికారులుగుర్తించారు.

ఇవే అవి..

యాకుత్ పురాలో 185, చార్మినార్ లో​ 163,చాంద్రాయణగుట్టలో 162, బహదూరుపురా-లో139, మలక్ పేటలో 119, గోషామహల్లో​57, కార్వాన్ సెగ్మెంట్ లో 57 ఉన్నాయి.వీటిలో అత్యంత సమస్యాత్మకమైనవి బహదూర్పురాలో 3, యాకుత్ పురాలో3, చార్మినార్ లో3, చాంద్రాయణగుట్టలో 2, మలక్ పేటలో 3పోలింగ్​ బూత్ లను అధికారులు గుర్తించారు. అలాగే, ముషీరాబాద్ లో19, అంబర్ పేటలో43, ఖైరతాబాద్ లో 21, సనత్ నగర్ లో​23,నాంపల్లిలో 23, సికింద్రాబాద్ లో 20 సమస్యాత్మక స్టేషన్లను గుర్తించారు. ఈసారి ఎన్నికలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, ఆయా పోలింగ్​కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు రిటర్నింగ్ అధికారులు చర్యలుతీసుకుంటున్నారు .

Latest Updates