మాస్కులు కట్టుకోకుంటే సమాజ సేవ చేయాల్సిందే

గాంధీనగర్: కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువవుతోంది. యూరప్‌‌లోనే గాక ఆసియా దేశాల్లోనూ వైరస్ పాజిటివ్‌‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ బారి నుంచి రక్షణగా తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల ప్రజలు మాస్కులు కట్టుకోకుండానే తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మాస్కులు కట్టుకోని వారికి ఢిల్లీ సర్కార్ రూ.2 వేలు ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడవాలని నిర్ణయించింది. అయితే వినూత్న శిక్ష వేయనుంది. కరోనా సెంటర్లలో మాస్కులు కట్టుకోని వారితో తప్పనిసరిగా సామాజిక సేవ చేయించాలని గుజరాత్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్‌‌ను జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Latest Updates