నేను సీఎం అయితే కునుకు తీసే రూల్ తెస్తా

పనాజీ: గోవాలో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ రాజకీయ నేతలు అప్పుడే వాగ్ధానాలు ఇవ్వడం మొదలైంది. గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజాయ్ సర్దేశాయ్ ప్రజలకు వినూత్న హామీ చేశారు. తాను సీఎం అయితే ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య రెండు గంటలపాటు నిద్రపోయేలా రూల్‌‌ను తీసుకొస్తానన్నారు.

‘గోవా సంస్కృతిలో ఉల్లాసంగా, ఉత్సాహంగా, సరదాగా, చిల్‌‌గా గడపడం ఓ భాగం. మధ్యాహ్నం సమయం చిన్న కునుకు తీయడం ఈ కల్చర్‌‌లో భాగం. ఇలా నిద్రపోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని క్లినికల్ టెస్టుల్లో నిరూపితమైంది. అలాగే జాబ్ పెర్ఫామెన్స్ మెరుగవ్వడంతోపాటు మనం మరింత అలర్ట్‌‌‌గా‌ ఉండేలా మన మూడ్ మారుతుంది’ అని విజాయ్ సర్దేశాయ్ పేర్కొన్నారు.

Latest Updates