కట్‌ , కాపీ, పేస్ట్‌ సృష్టికర్త ఇకలేరు

కంప్యూటర్‌‌‌‌ సైంటిస్టు లారీ టెస్లర్‌‌‌‌ కన్నుమూత

స్టమ్‌‌‌‌ను గానీ, ఫోన్‌‌‌‌ను గానీ వాడేటోళ్లకు కట్‌‌‌‌, కాపీ, పేస్ట్‌‌‌‌ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వీటితో చాలా వరకు పనులు ఈజీగా అయిపోతుంటాయి. అలాంటి కట్‌‌‌‌, కాపీ, పేస్ట్‌‌‌‌లను సృష్టించింది ఎవరో తెలుసా? కంప్యూటర్‌‌‌‌ సైంటిస్టు లారీ టెస్లర్. 74 ఏళ్ల టెస్లర్‌‌‌‌ బుధవారం కన్నుమూశారు. ఆయన పని చేసిన జిరాక్స్‌‌‌‌ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. లారీ సేవలను గుర్తు చేసుకున్న సిలికాన్‌‌‌‌ వ్యాలీ.. ఆయనకు నివాళులర్పించింది. సోషల్‌‌‌‌ మీడియాలోనూ నెటిజన్లు సంతాపం తెలుపుతున్నారు.

స్టాన్‌‌‌‌ఫోర్డ్‌లో చదువు
టెస్లర్‌‌‌‌ 1945లో అమెరికాలో పుట్టారు. స్టాన్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ వర్సిటీలో కంప్యూటర్‌‌‌‌ సైన్స్‌‌‌‌ చదివారు. హ్యూమన్‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌ ఇంటరాక్షన్‌‌‌‌లో స్పెషలిస్టు. యాపిల్, అమెజాన్, యాహూ, జిరాక్స్ సంస్థల్లో పనిచేశారు.1970 జిరాక్స్‌‌‌‌ పాలో ఆల్టో పరిశోధన కేంద్రంలో పని చేస్తున్నప్పుడు కట్‌‌‌‌, కాపీ, పేస్ట్‌‌‌‌ కీల ఆలోచన వచ్చింది. ప్రింట్‌‌‌‌ చేసిన కాపీలను కట్‌‌‌‌ చేసి వేరే చోట అతికించడం స్ఫూర్తిగా వీటిని సృష్టించారు. ఈ కమాండ్‌‌లను యాపిల్‌‌‌‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. 1983లో తన లీసా కంప్యూటర్‌‌‌‌లో చేర్చింది. తర్వాతి ఏడాది అందుబాటులోకి వచ్చిన మసిం తోష్‌ సిస్టమ్‌‌‌‌లో వీటిని చేర్చడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అమెజాన్‌‌‌‌, యాహూల్లో చదువుకు సంబంధించిన స్టార్టప్‌‌ను టెస్లర్‌‌‌‌ ప్రారంభించారు. యూజర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ టెక్నాలజీలపై పని చేశారు. తన మరణానికి ముందు శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కోలోని ఓ కన్సల్టింగ్‌‌‌‌ సంస్థలో పని చేశారు.

నో మోడ్స్‌ ..
కంప్యూటర్లు ‘మోడ్స్‌‌‌‌’ వాడకాన్ని ఆపేయాలని టెస్లర్‌‌‌‌ కోరుకునేవారు. అప్పట్లో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ డిజైన్‌‌‌‌లో అవే కీలకం. సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లో వివిధ రకాల ఫంక్షన్‌‌‌‌ల మధ్య మారడానికి ఇవే కీలకం. కానీ వీటి వాడకం చాల కష్టం. పైగా ప్రోగ్రామ్‌‌‌‌ నడవడానికి కంప్యూటర్‌‌‌‌ ఎక్కువ టైం తీసుకుంటుంది. మోడ్స్‌‌‌‌ వాడకుండా ప్రోగ్రామ్‌‌‌‌ రాయడానికి ప్రయత్నించాలని ఆయన ఎంతలా అనుకున్నారో తెలుసా? ‘నో మోడ్స్‌‌‌‌.కామ్‌‌‌‌’ పేరుతో వెబ్‌ సైట్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. తన ట్విట్టర్‌‌‌‌ ఖాతాకు ‘నోమోడ్స్‌‌‌‌’ అనే పేరు పెట్టారు. చివరికి తన కారు రిజిస్ట్రేషన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌పైనా నో మోడ్స్‌‌‌‌ అని రాసుంటుంది.

Latest Updates