CAA కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు..144 సెక్షన్ అమలు

ఢిల్లీలో ఎర్రకోట రణరంగంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA)కు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనకారులు ఇవాళ ఎర్రకోట దగ్గర భారీ ర్యాలీకీ పిలుపునిచ్చారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. అనుమతి లేకపోయినా ఉదయం వేలాది మంది నిరసనకారులు రెడ్ పోర్టు దగ్గరకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

CAA ఆందోళనల దృష్ట్యా ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. దీంతో ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దులో వాహనాల రాకపోకలు నిలిచిపోయి..ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీలోని 13 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. ఆయా స్టేషన్లలో మెట్రో రైళ్ల స్టాప్ ను ఎత్తివేసినట్లు తెలిపారు.

 

Latest Updates