కోరుట్ల ఎమ్మెల్యే వైఖరిపై మొక్కజొన్న రైతుల ఆందోళనలు

జగిత్యాల: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తమను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు మొక్కజొన్న రైతులు. జగిత్యాలలో పంటలకు మద్దతు ధర కోసం రైతులు ధర్నా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ ఇంటిపై రైతులు రాళ్లు రువ్వారు. నిజామాబాద్‌ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్, మెట్ పల్లి మండలం వేంపేటలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు రైతులు.

ఎమ్మెల్యే తమను కించపరిచేలా మాట్లాడారన్నారు. మెట్ పల్లి మండలం వేంపేటలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశిన మొక్కజొన్న రైతులు.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలను దారి మళ్లించారు.

Latest Updates