లాక్ డౌన్ : భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు

21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా దేశంలో కండోమ్, పిల్స్  అమ్మకాలు భారీ ఎత్తున జరిగినట్లు న్యూస్ 18 తెలిపింది.

హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో బ్రతకాలంటే భార్యాభర్తలు తప్పని సరిగా ఉద్యోగం చేయాలి. దీంతో దంపతులు షిఫ్ట్ లు వారీగా ఉద్యోగాలు చేస్తూ సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతా బాగున్న.. దంపతులు మధ్య ఏదో తెలియని వెలితి. ఆ వెలితిని పూడ్చుకునేందుకు లాక్ డౌన్ తో ఒకరి గురించి ఒకరు తెలుసుకునే పనిలో పడ్డారని ఫార్మసీ, ఈ- కామర్స్ సంస్థలు చెబుతున్న ట్లు న్యూస్ 18 వెల్లడించింది. లాక్ డౌన్ ప్రభావం  ఫార్మసీ, ఈ- కామర్స్ రంగాలపై ఎలా ఉందనే  డేటా ను సేకరించింది. ఆ డేటా ఆధారంగా 21 రోజుల లాక్ డౌన్ తో భార్య భర్తలు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సమయం దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆ డేటాలో తేలింది.

కండోమ్ ప్యాకెట్ల సేల్స్ పెగుతున్నాయి: షా నవాజ్ 

కరోనా వైరస్ ఆందోళన కలిగించే విషయమే అయినా ఉరుకులు పరుగులు జీవితాన్ని గడుపుతున్న దంపతులుకు ఇప్పుడు సమయం దొరికిందని ,లాక్ డౌన్ తో నిత్యవసర సరుకులతో పాటు మెడిసిన్, కండోమ్,గర్భనిరోధక ట్యాబ్లెట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాస్క్ లతో పాటు చాలా మంది  క్లోరోక్విన్ మరియు ఇమ్యూనిటీ పవర్ పెంచే మెడిసిన్ ను కొనుగోలు చేస్తున్నారని, వీటితో పాటు కండోమ్ లను భారీ గా కొనుగోలు చేస్తున్నట్లు ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలోని లాయల్ ఫార్మసీకి చెందిన షా నవాజ్ చెప్పారు.

సెంట్రల్ ఢిల్లీలో పేరు చెప్పని ఫార్మసి యజమాని మాట్లాడుతూ కరోనాని అరికట్టేందుకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్స్ తో పాటు  కండోమ్ ల అమ్మకం పెరిగిందని అన్నారు.

వైరస్ తో యుద్ధమే..దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది

వైరస్ తో యుద్ధం చేసే సమయమే అయినా..లాక్ డౌన్ తో దంపతులు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని ఢిల్లీ  సర్ గంగా రామ్ హాస్పిటల్  కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్ రాజీవ్ మెహతా అన్నారు.

” ఉరుకులు పరుగులతో యాంత్రిక జీవితంతో బిజీగా ఉన్న దంపతులు ఈ లాక్ డౌన్ తో ఇంట్లో ఉన్న ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఉన్నారని  చెప్పారు. అంతేకాదు చాలా మంది దంపతులు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారని, కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారన్న మెహతా..పిల్లల గురించి ఆలోచించే సమయం , అంత తీరిక లేకపోవడంతో  దంపతులు మధ్య లైంగిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడేందుకు జాగ్రత్తలు తీసుకొంటున్నారని డాక్టర్ మెహతా చెప్పారు.

ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటున్నాం

ఘజియాబాద్‌ లో ఉంటున్న  నికితా శ్రీవాస్తవ (26), గౌరవ్ మాథుర్ (29) లాక్ డౌన్ తో సమయం దొరికిందని ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటున్నామని చెబుతున్నారు.

ఇద్దరం ఉద్యోగాలు చేస్తాం. నా భర్త నైట్ ఆఫీస్ కి వెళితే ..తాను డే షిఫ్ట్ ఆఫీస్ కు వెళుతున్నట్లు ..ఇప్పుడు సమయం దొరికింది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం కరోనా వైరస్ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకునేందుకు డాక్టర్లను సంప్రదించినట్లు న్యూస్ 18కు తెలిపారు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం : గౌరవ్ మాథుర్

గతంలో కంటే ఇప్పుడు ఒకరికొకరం సాన్నిహితంగా ఉంటున్నాం. మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్ గురించి ప్లాన్ చేసుకుంటున్నాం . రహస్యాల్ని పంచుకుంటున్నారు. నేను నా భార్య గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నా. లాక్ డౌన్ తో కరోనా వైరస్ తో విచారంగా..ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉంటున్నట్లు గౌరవ్ తెలిపారు.

తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడ్డాం: జినియా ఘోష్

గతేడాది వివాహం జరిగినా ఉద్యోగంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. కరోనా వైరస్ తో ఆందోళనగా ఉన్నా.. విశ్రాంతి తీసుకునేందుకు చాలా సమయం దొరికింది. భర్తతో టైం స్పెండ్ చేయడం, నచ్చిన వంటల్ని చేసుకొని తినడం వల్ల రిలాక్స్ అవుతున్నట్లు తెలిపారు.

లాక్ డౌన్ తో పిల్స్, కండోమ్ అమ్మకాలు భారీగా పెరుగుతాయని  ఓ డాక్టర్ చెప్పినట్లు న్యూస్ 18 వెల్లడించింది.

Latest Updates