దేశంలో 59662కి చేరిన కరోనా కేసుల సంఖ్య

గడిచిన 24గంటల్లో 95మంది కరోనాతో మరణించినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం వరకు 59662 మందికి సోకగా..17847మంది డిశ్చార్జ్ అయ్యారు.  కాగా  ఇప్పటి వరకు వైరస్ తో 1981 మంది మృతి చెందగా..3320 కొత్త కేసులు నమోదయ్యాయి.  ఢిల్లీలో కరోనా కేసులు 6వేలు దాటినట్లు తెలుస్తోంది.

స్వదేశానికి భారతీయులు 

విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు.  లాక్ డౌన్ కారణంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తెచ్చేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్, యుఎఇ, మస్కట్, మలేషియాలో ఉన్న భారతీయుల్ని ఓడలు, విమానాల ద్వారా స్వదేశానికి తరలించింది.

ప్రపంచ వ్యాప్తంగా 3.86మిలియన్లు దాటిన కరోనా కేసులు 

ప్రపంచవ్యాప్తంగా 3.86 మిలియన్ల మందికి పైగా నవల కరోనావైరస్ సోకినట్లు తెలుస్తోంది.   మరియు 2,68,620 మంది మరణించారు. కరోనాతో యుఎస్ తరువాత 30,000మరణాలతో  ఎక్కువ నమోదైన దేశంగా ప్రపంచంలోనే ఇటలీ మూడో స్థానంలో నిలిచింది.

Latest Updates