గద్వాలలో కాంగ్రెస్‌, MIM కార్యకర్తల మధ్య ఘర్షణ

జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై…పోలీసుల నిఘా కంటే… ఆయా రాజకీయ పార్టీల నేతల నిఘానే ఎక్కువగా ఉంది. ఒక పార్టీపై ..మరో పార్టీకి అనుమానం వస్తే అడ్డుకోవడం చేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట పోలింగ్ సెంటర్ దగ్గర ఎంఐఎం. కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త గాయపడ్డాడు. పోలింగ్ జరుగుతుండగా గంజిపేట పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ నేత… ఎంఐఎం వాళ్లు ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ అక్కడి వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో MIM సభ్యులు ఎదురు తిరిగారు. రెండు వర్గాల వాళ్లు తోపులాటకు దిగడంతో ఘర్షణ మొదలయ్యింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త కాలికి గాయమయింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జితో ఇరువర్గాలను చెదరగొట్టారు.

Latest Updates