వాళ్లలో వాళ్లే తన్నుకుంటున్న టెర్రరిస్టులు

Conflict between terrorist groups in Kashmir

కాశ్మీర్​లో ఐబీ రిపోర్ట్

శ్రీనగర్: ‘మీలో మీరు తన్నుకుచావడం ఆపి, మీకిచ్చిన టార్గెట్లపై దృష్టి పెట్టండి’ అంటూ పలు టెర్రరిస్టు గ్రూపులకు పైనుంచి ఆదేశాలు అందాయట.. మన ఇంటెలిజెన్స్​ వర్గాల రిపోర్టుల ప్రకారం ‘ఆర్టికల్​370’ రద్దు తర్వాత జమ్మూ, కాశ్మీర్​లలో టెర్రరిస్టులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కాశ్మీర్‌ లోయలో ఆర్మీ కదలికలు, ట్రూపుల సంఖ్యతో పాటు దాడులు పెరగడంతో వారిలో కన్ఫ్యూజన్​ నెలకొంది. దాడులు జరపడానికి అవకాశం లేకపోవడం, కామ్​గా ఉండాల్సి రావడంతో పక్క గ్రూపులతో గతంలో ఉన్న విభేదాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. దీంతో ఆ గ్రూపుల మధ్య గొడవలు మొదలయ్యాయి. గ్రూపుల మధ్య సరిహద్దులతో పాటు ఇతర అంశాలపై గొడవలు జరగడంతో టెర్రరిస్ట్  గ్రూపుల ‘ఆర్గనైజర్లు’ కల్పించుకున్నారు. గొడవలు ఆపేసి, ఎవరికిచ్చిన టార్గెట్లపై వారు దృష్టి పెట్టాలని మందలించారట. గ్రూపుల వారీగా చేపట్టే ఆపరేషన్లలోనూ కలిసికట్టుగా ఉండాలని ఆదేశించారట. హిజ్బుల్​ ముజాహిదీన్, జైషే మొహ్మద్‌లతో పాటు లష్కరే తోయిబా టెర్రరిస్టులకు ఈ ఆర్డర్లు అందాయని ఐబీ బయటపెట్టింది.

Conflict between terrorist groups in Kashmir

Latest Updates