మాస్కు కట్టుకోలేదని ఆఫీసర్ కు చుక్కలు చూపించారు

భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వైరస్ కట్టడి కోసం పలు గ్రామాల్లో కంచె వేస్తూ పలువురికి ఈ వైరస్ పై యువకుడు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ గ్రామంలోని యువత తమ ఊరికి బయటివారు రాకూడదని కంచె వేశారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఫేస్ కు మాస్కులు, కర్చీప్ లు కట్టుకొవడమేకాక చేతులకు పసుపు రాసుకున్నారు. అయితే ఈ గ్రామం నుంచి వెళ్తున్న ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఫేస్ కు మాస్కు వేసుకోకపోవడం గమనించిన గ్రామ యువకులు.. అతడికి చుక్కలు చూపించారు. ఉన్నతాధికారి అయి ఉండి మీరే మాస్కు కట్టుకోపోతే ఎలా అని నిలదీశారు.

అతడు నన్నే నిలదీస్తారా అని వాధించినా ముందు ఫేస్ కు కర్చీప్ పెట్టుకుని మాట్లాడండి సార్ అంటూ వీడియో తీశారు. దీంతో కాసేపు అక్కడ ఇరువురి మధ్యన ఘర్షణ జరిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో జరిగింది. కరోనా మహమ్మారి గురించి నలుగురికి చెప్పాల్సిన అధికారే నిర్లక్ష్యం వహించడంపై ఆ గ్రామస్తులు అధికారి తీరుపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యువకులు చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.

Latest Updates