భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య

మలక్ పేట, వెలుగు: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నా డు. పూసల బస్తీకి చెందిన సుమలత(29), రాజేష్(32) కు 2011లో వివాహం జరిగింది. వీరికి కుమార్తె(7) ఉంది. అయితే తాగుడుకు బానిసైన రాజేష్ ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబ పోషణ కోసం సుమలత బజాజ్ ఫైనాన్స్
కంపెనీలో టెలీకాలర్ గా ఉద్యోగం చేస్తుంది. తన ఒక్కదానితో కుటుంబం నడవాలంటే భారంగా ఉంటుందని నువ్వు కూడా ఏదోక పనిచేయాలని సుమలత భర్తను కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే రాజేష్ ఓ గ్యాస్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. మద్యానికి బానిసైన రాజేష్ ఆరోగ్యం బాగోలేక మందులు వాడుతున్నాడు.

అయితే శనివారం పనికి వెళ్లిన రాజేష్ మందులు మర్చిపోయాడని గ్యాస్ కంపెనీకి ఫోన్ చేసి తన భర్తకు ఫోన్ ఇవ్వమని సుమలత కోరింది. అయితే రాజేష్ 10 రోజులుగా రావడం లేదని వారు తెలిపారు. ఈ విషయంపై శనివారం రాత్రి భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. రాత్రి భోజనం చేశాక బెడ్ రూంలో రాజేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన భార్య 108ను రప్పించింది. అప్పటికే అతను మృతి చెందాడని 108 సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సైదాబాద్ పోలీసులు.

Latest Updates