ఫ్లైట్స్ స్టార్ట్‌ చేయడంపై రాష్ట్రాల్లో నో క్లారిటీ

  • స్టార్ట్‌ చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: రెండు నెలల తర్వాత ప్రారంభం కానున్న డొమస్టిక్‌ ఫ్లైట్ల విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై, కోల్‌కతా, చెన్నై ఎయిర్‌‌పోర్ట్‌లోకి ఫ్లైట్లు అనుమతిస్తారా లేదా అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డొమస్టిక్‌ ఫ్లైట్లు స్టార్ట్‌ అవుతాయని కేంద్రం ప్రకటించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు వాటిని అపోజ్‌ చేశాయి. ఈ నెల 19న ఇచ్చిన ఆదేశాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సవరణ చేయలేదు. దీంతో ఫ్లైట్లను అనుమతించడంపై సందిగ్ధత నెలకొంది. కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విమానాలను అనుమతించడం కరెక్ట్‌ కాదని, నిలిపేయాలని ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాయి. పశ్చిమబెంగాల్‌లో అంఫన్‌ తుపాను కారణంగా ఎయిర్‌‌పోర్ట్‌ మునిగిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నెల 30 వరకు కోల్‌కతా ఎయిర్‌‌పోర్ట్‌లో ఫ్లైట్లు నడిపే పరిస్థితి లేనందున నార్త్‌ బెంగాల్‌లోని బగ్దోగ్రా ఎయిర్‌‌పోర్ట్‌కి ఫ్లైట్లను అనుమతించాలని కోరుతామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రెడ్‌ జోన్‌లో ఫ్లైట్లను రీస్టార్ట్‌ చేయడం మంచిది కాదని, థర్మల్‌ స్క్రీనింగ్‌ తదితర అంశాలు కష్టం అవుతాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ అన్నారు. ఒకవేళ స్టార్ట్‌ చేసినా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లేనందన కష్టం అవుతుందని ఆయన ట్వీట్‌ చేశారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంపై కేంద్రానికి లెటర్‌‌ కూడా రాసింది. మరోవైపు విమానయాన సంస్థలు మాత్రం బుకింగ్స్‌ ఓపెన్‌ చేశాయి. గో ఎయిర్‌‌ మాత్రం ఇంకా క్లారిటీ రానందున బుకింగ్స్‌ స్టార్ట్‌ చేయలేదని చెప్పింది. లాక్‌డౌన్‌ కారణంగా విమానాలపై రెండు నెలలు బ్యాన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి డొమస్టిక్‌ ఫ్లైట్లు స్టార్ట్‌ చేయనుంది.

Latest Updates