బతుకమ్మ పండుగపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలి

బతుకమ్మ పండుగ నిర్వహణపై అందరిలోనూ అయోమయం ఏర్పడింది. ప్రతి యేటా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య … పితృ అమావాస్య రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలై 9 రోజులు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది అధిక మాసం రావడంతో పండగ నిర్వహణపై చర్చ మొదలైంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందని జనం అభిప్రాయపడుతున్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది.   ప్రతి యేటా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య … పితృ అమావాస్య రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలై 9 రోజులు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది అధిక మాసం రావడంతో బతుకమ్మ పండగ నిర్వహణపై చర్చ మొదలైంది. కొందరు పండితులు యధావిధిగా ఈ నెల 17 న అమావాస్య రోజు నుంచి ఎంగిలి పువ్వు బతుకమ్మ నిర్వహించి…. మళ్ళీ నెల తర్వాత అక్టోబర్ 17 నుంచి మిగతా 8 రోజులు పండుగ జరుపుకోవాలని అంటున్నారు.

ఆచారాలకు, శాస్త్రాలతో బతుకమ్మని ముడిపెట్టొద్దనీ…ఈ పండగ ఆచారంతో మొదలైందని ప్రముఖ సిద్దాంతి అనంత మల్లయ్య శాస్త్రీ చెబుతున్నారు. నిజ ఆశ్వీజంలోనే పండగ జరుపుకోవాలంటున్నారు. అక్టోబర్ 16న పండగని మొదలుపెట్టి…వరుసగా తొమ్మిది రోజులు జరుపుకోవాలని చెబుతున్నారు. పండుగలను నిర్ణయించడం సిద్ధాంతులు పంచాంగకర్తలు చేస్తారనీ…. నిర్ణయించిన పండుగలను వేద పండితులు, పురోహితులు ప్రకటిస్తారని అంటున్నారు. బాద్రపద అమావాస్య రోజునే పండగ జరుపుకుని…. మిగతా ఎనిమిది రోజులు అక్టోబర్ 17 నుంచి నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైదిక పురోహితుల సంఘం ప్రకటించింది. ఈనెల 17న పితృ అమావాస్య రోజున ఎంగిలిపువ్వు బతుకుమ్మను పేర్చుకోవాలనీ… వచ్చే నెల 17న ఆశ్వీజ శుద్ద పాడ్యమి నుంచి 24న దుర్గాష్టమి వరకూ బతుకుమ్మ పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై బిన్నమైన నిర్ణయాలతో జనం అయోమయంలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Latest Updates