ఎన్నో అనుమానాలు: హఫీజ్ పేట్ భూములు ఎవరివి?

confusion-on-the-survey-no-80-in-hafiz-pet-land

బోయిన్ పల్లి కిడ్నాప్ జరిగి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇటు రెవెన్యూ అధికారులు..అటు పోలీసులు నోరు విప్పడం లేదు. హఫీజ్ పేట్ భూముల కోసమే కిడ్నాప్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే హఫీజ్ పేట్ భూములు ఎవరివి. ఈ భూములు తమవేనని భూమా అఖిరప్రియ, ఏవీ సుబ్బారెడ్డి చెప్తున్నారు. కాదు ఆ భూముల్ని తమవేనని ప్రవీణ్ రావు అంటున్నారు. హఫీజ్ పేట్ లో సర్వే నంబర్ 80 అంతా కన్ఫ్యూజన్. ఈ భూముల్ని వీళ్లకు అమ్మింది ఎవరు. మరోవైపు ఈ భూములు సర్కార్ వేనని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ భూములైతే ప్రవేటు వ్యక్తుల చేతికి ఎలా వెళ్లాయి. అసలు భూమి ఎవరిది.? భూమానాగిరెడ్డి,ఏవీ సుబ్బారెడ్డికి భూమి ఎట్ల వచ్చింది.? ప్రవీణ రావుకు భూమి అమ్మింది ఎవరు? లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? లేదా? జీపీఏ చేసింది ఎవరు?ఎవరిపై చేశారు.అసలు రికార్డులపై ఎవరి పేరు ఉంది. వందల కోట్ల భూమిపై సవాలక్ష అనుమానాలున్నాయి. అధికారులు మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు.

వ్యవసాయ చట్టాలను కొంత కాలం నిలిపివేస్తారా?

 

Latest Updates