పదవి కాలం పూర్తయింది.. TRSలో చేరుతున్నా : MLC సంతోష్

ఈ సాయంత్రం టీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్. గతేడాది చివర్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు సంతోష్ కుమార్. ఐతే.. ఇవాళ్టితో ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి అవుతుండటంతో… కరీంనగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.

“నేటితో నా ఎమ్మెల్సీ పదవికాలం పూర్తవుతోంది. రేపటి నుంచి నేను మాజీ ఎమ్మెల్సీని. ఇవాళ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో అధికారికంగా టీఆర్ఎస్ లో చేరుతున్నా. నేను ఏ పదవీ ఆశించి టీఆర్ఎస్ లో చేరడం లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అందుకే తాను కూడా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నా” అని చెప్పారు ఎమ్మెల్సీ సంతోష్ కుమార్.

Latest Updates