సుశాంత్‌ కేసులో సుప్రీం తీర్పుపై సెలబ్రిటీల హర్షం

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి ముంబై పోలీసుల వద్ద ఉన్న అన్ని ఆధారాలను సీబీఐకి సమర్పించాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీర్పును స్వాగతిస్తూ బీ–టౌన్ సెలబ్రిటీలు ట్వీట్‌లు చేశారు. ఖిలాడీ అక్షయ్ కుమార్, లేడీ సూపర్‌‌ స్టార్ కంగనా రనౌత్, కృతి సనన్‌లు దీనిపై ట్వీట్ చేశారు. నిజం ఎల్లప్పుడూ వ్యాప్తి చెందాలని అక్షయ్ ట్వీట్ చేశాడు.

‘మానవత్వం గెలిచింది. సుశాంత్ సింగ్ వారియర్స్ అందరికీ కంగ్రాట్స్. తొలిసారి నేను బలమైన సామూహిక స్పృహను అనుభూతి చెందుతున్నా. అమేజింగ్’ అని కంగనా ట్వీట్ చేశారు.

‘గత రెండు నెలలు ప్రతిదీ చాలా అస్పష్టంగా అనిపించింది. సుశాంత్ కేసును సీబీఐకి సుప్రీం అప్పగించడం ఆఖరుకు నిజమే నెగ్గుతుందనే ఆశను రేపుతోంది. అందరూ విశ్వాసం ఉంచండి. ఊహాగానాలు ఆపండి. సీబీఐని వాళ్ల పని చేసుకోనివ్వండి!’ అని హీరోయిన్ కృతి సనన్ కోరారు.

‘ఇదో పాజిటివ్ స్టెప్. ఈ క్షణాన్ని దయచేసి గౌరవిద్దాం. సీబీని వారి పని చేసుకోనిద్దాం. ఊహాగానాలకు తెరదించుదాం, అలాగే మనంత మనమే ఓ నిర్ణయానికి రావడాన్ని ఆపుదాం’ అని హీరోయిన్ పరిణీతి చోప్రా ట్వీట్టర్‌‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Latest Updates