కంగ్రాట్స్ ఇండియా.. నెక్స్ట్ నా కూతురినే అరెస్ట్ చేస్తారనుకుంటా?

రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి కామెంట్స్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్ లింక్స్ పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే రియా ఇంట్లో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రియా తండ్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి స్పందించారు. షోవిక్ అరెస్ట్ పై ఆయన కామెంట్స్ చేశారు. ‘కంగ్రాట్స్ ఇండియా, మీరు నా కొడుకును అరెస్ట్ చేశారు. నెక్స్ట్ లైన్ లో ఉన్నది నా కూతురే అనుకుంటా. ఆ తర్వాత మరెవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. మీరు చాలా ప్రభావవంతంగా ఓ మధ్య తరగతి కుటుంబాన్ని పడగొట్టారు. న్యాయం కోసం అన్నీ సమర్థించబడుతున్నాయి’ అని ఇంద్రజిత్ చెప్పారు. ఎన్సీబీ దర్యాప్తు ప్రకారం సుశాంత్ తోపాటు మరి కొందరు బాలీవుడ్ స్టార్స్ కు షోవిక్ డ్రగ్స్ అందించే ఫెసిలిటేటర్ గా పని చేసే వాడని సమాచారం.

Latest Updates