కాంగ్రెస్‌ ఎప్పుడూ మతపరమైన కామెంట్స్ చేయదు

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ మతపరమైన కామెంట్స్ చేయదన్నారు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య.  ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే కేంద్ర, రాష్ట్ర నాయకులకు పట్టడం లేదన్నారు.  ప్రజల రక్షణను గాలికొదిలేశారని.. టీఆర్ఎస్, ఎంఐఏం , బీజేపీ మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రానికి కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలని..  గ్రేటర్ ఎన్నికల కోసం ఢిల్లీ నేతలు గుంపులు గుంపులుగా ప్రచారానికి వస్తున్నారు కానీ.. తెలంగాణ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదన్నారు.

Latest Updates