దొంగ ఓట్లు వేస్తున్నవారిని చితక్కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా  హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 8వ వార్డులో నకిలీ ఓటర్ కార్డులతో ఓటుకు రూ.3 వేలు ఇచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకుని 70 మందితో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇద్దర్ని పట్టుకుని చితకొట్టారు. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నేత దొంగ ఓట్లు వేయిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 8వ వార్డు పోలింగ్ సెంటర్ దగ్గర కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కలగజేసుకుని రెండు వర్గాల వారికి సర్ధి చెప్పారు.

Latest Updates