హడావిడి లేకుండా డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్

Congress Announces DCC Presidents List in Telangana

Congress Announces DCC Presidents List in Telanganaడీసీసీ అధ్యక్షులను ప్రకటించింది కాంగ్రెస్. 31 జిల్లాలకు కొత్త సారథులను నియమించింది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలను డీసీసీ పదవులు దక్కాయి. ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డికి వికారాబాద్, వనమా వెంకటేశ్వరరావుకు భద్రాద్రి కొత్తగూడెం, ఆత్రం సక్కుకు ఆసిఫాబాద్ డీసీసీ పగ్గాలు దక్కాయి. భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా గండ్ర జ్యోతి, సంగారెడ్డి బాధ్యతలు నిర్మాల జగ్గారెడ్డికి ఇచ్చారు. కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్, యాదాద్రి జిల్లాలకు పాత వారినే మళ్లీ నియమించారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నర్సారెడ్డికి సిద్దిపేట జిల్లా అప్పగించారు. గ్రేటర్ చీఫ్ గా మళ్లీ అంజన్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. కూన శ్రీశైలం గౌడ్ కు మేడ్చల్ డీసీసీ బాధ్యతలు ఇచ్చారు. డీసీపీ ఎంపికలో సామాజిక న్యాయం పాటించింది కాంగ్రెస్. అన్ని వర్గాల వారికి చోటు కల్పించింది.

వికారాబాద్ జిల్లా – పైలెట్ రోహిత్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – వనమా వెంకటేశ్వరరావు
ఆసిఫాబాద్ జిల్లా – ఆత్రం సక్కు
భూపాలపల్లి జిల్లా- గండ్ర జ్యోతి
సంగారెడ్డి జిల్లా- నిర్మలా జగ్గారెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
మేడ్చల్ జిల్లా- కూన కూనశ్రీశైలం గౌడ్
కరీంనగర్ జిల్లా- కటకం మృత్యంజయం
వరంగల్ అర్బన్ జిల్లా – నాయిని రాజేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా – భిక్షమయ్య గౌడ్
మహబూబ్ నగర్ జిల్లా – ఒబెదుల్లా కొత్వాల్
సిద్దిపేట జిల్లా – టి నర్సారెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా- వంశీకృష్ణ
ఖమ్మం జిల్లా- పువ్వాడ దుర్గాప్రసాద్
జనగామ జిల్లా- జంగా రాఘవరెడ్డి

Latest Updates