పకియావ్ లెక్కనే నేను: విజేందర్‌‌ సింగ్‌‌

న్యూఢిల్లీ: ఫిలిప్పైన్స్‌‌ లెజండరీ బాక్సర్‌‌ మన్నీ పకియా తనకు ఆదర్శమని సౌత్‌‌ ఢిల్లీ కాంగ్రెస్‌‌ కేండిడేట్‌ విజేందర్‌‌ సింగ్‌‌ చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినా పకియావ్ లా బాక్సింగ్‌‌ను వదిలిపెట్టేదిలేదని ఒలింపిక్ బ్రాంజ్‌‌ మెడలిస్ట్‌‌ స్పష్టం చేశారు. ‘‘బాక్సింగ్‌‌ అంటే నాకు ప్రాణం. అదే నా ఫస్ట్‌‌ లవ్‌‌.. దాన్ని వదలిపెట్టేదిలేదు. దాంతోనే నాకు గుర్తింపు’’ అని అన్నారు. 33 మూడేళ్ల విజేందర్‌‌  బీజేపీ సిట్టింగ్‌‌ ఎంపీ రమేశ్‌ బిధురి, ఆమ్‌‌ ఆద్మీ పార్టీకి చెందిన రాఘ్‌ ఛద్దాతో తలపడుతున్నారు. హర్యానాలోని భివానికి చెందిన విజేందర్‌‌  సోమవారం నామి నేషన్‌‌ ఫైల్‌‌ చేశారు. లోక్‌‌సభకు అడుగుపెట్టినా బాక్సర్‌‌ విజేందర్‌‌ గానే తనకు గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు.

ఎంపీగా గెలిస్తే తాను యూత్‌‌, స్పోర్స్‌ట్ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. యువతకు ఉద్యో గాలు సృష్టించడమే టాప్‌‌ ప్రయారిటీ అన్నారు. స్పోర్స్‌ట్ పర్సన్‌‌గా ఆటలకు మరిన్ని సదుపాయాలు కల్పిం చడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. 2014 లోక్‌‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్‌‌ను ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు ..పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం వల్లే తాను ఆ పార్టీ పట్ల ఆకర్షితుణ్ని అయ్యానని చెప్పారు. ‘‘ఓటర్లకు ఫ్రెండ్‌‌గా ఉండాలనుకుంటున్నాను. సభలు పెట్టను. రోడ్డు షోలు చేయను’’ అని తన ప్రచార వ్యూహాన్ని ఆయన వివరించారు. ప్రచారానికి ఎక్కు వగా సోషల్‌‌ మీడియాపైనే ఆధారపడతానన్న విజేందర్‌‌ను ట్విటర్‌‌లో 30 లక్షలమందికిపైగా ఫాలో అవుతున్నారు.

ఇంతకీ పకియావ్‌ ఎవరు?

40 ఏళ్ల పకియావ్‌ ఫిలిప్పైన్స్‌‌కు చెందిన ప్రముఖ బాక్సర్‌‌. హౌస్‌‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌‌కు 2010లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2016లో సెనె ట్‌ కు ఎలెక్ట్‌‌ అయ్యారు. ఈ పదవిలో ఆయన 2022 వరకూ ఉంటారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా యాక్టివ్‌‌ బాక్సర్‌‌గా తానేంటో ఆయన రుజువు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన డబ్ల్యూబీఏ వెల్టర్‌‌ వెయిట్‌ టైటిల్‌‌ కోసం జరిగిన పోటీలో అమెరికన్‌‌ అడ్రియన్‌‌ బ్రోనెర్‌‌ ఓడించి టైటిల్‌‌ను నిలబెట్టుకున్నారు.

 

Latest Updates