ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె ఆదివారం సదరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఓ సీనియర్ డాక్టర్ తెలిపారు. 73 ఏళ్ల సోనియా రొటీన్ టెస్ట్‌లు, ఇన్వెస్టిగేషన్స్‌ కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని డాక్టర్‌‌లు చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ జూలై 30న సాయంత్రం 7 గంటలకు గంగా రామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఇవ్వాళ మధ్యాహ్నం 1 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఆమె ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది’ అని గంగా రామ్ హాస్పిటల్ చైర్‌‌ పర్సన్ డా.డీఎస్ రాణా తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కడుపు నొప్పితో బాధపడుతూ గంగా రామ్ ఆస్పత్రిలో సోనియా అడ్మిట్ అయ్యారు.

Latest Updates