ఢిల్లీలో ఆప్ తో కాంగ్రెస్ కటీఫ్.. బరిలో షీలా దీక్షిత్

ఢిల్లీలో ఒంటరి పోరుకు సిద్ధమైంది కాంగ్రెస్. ఆమ్ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్ సభ నియోజక వర్గాలు ఉండగా.. ఆప్ నాలుగు స్థానాలను కోరింది. కాంగ్రెస్ అందుకు నిరాకరించి ఒంటరిపోటీకి రెడీ అయింది.

ఏడు లోక్ సభ నియోజకవర్గాలకుగాను.. ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేయబోతున్నారు. పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ నుంచి, జేపీ అగర్వాల్ చాందిన్ చౌక్  నుంచి పోటీ చేయనున్నారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి అర్విందర్ సింగ్, వెస్ట్ ఢిల్లీ నుంచి మహబల్ మిశ్రా బరిలో ఉన్నారు.

Latest Updates