కాంగ్రెస్ తీర్మానం: పార్టీ ఫిరాయింపుల ఫైట్

పార్టీ ఫిరాయిం పులపై తాడోపేడో తేల్చుకునేం దుకుకాం గ్రెస్ సి ద్ధమైంది. రాష్ట్రం లో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు అధికార పార్టీ టీఆర్ ఎస్ కుట్రలు పన్నుతోందని, దాని వైఖరిని ప్రజల్లో ఎండగట్టా లని నిర్ణయించింది. ఇందుకోసం ఫిరాయిం పు ఎమ్మెల్యేల ని యోజకవర్గా ల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. దాం తోపాటు క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు, మరింత నష్టం జరగకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించింది. గాంధీభవన్‌‌‌‌లో శుక్రవారం సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా రు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో అభిమానంతో ఓటువేసి గెలిపిం చుకుం టే వారు రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయిం చడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోం దని సమావేశంలో పాల్గొన్న కొం దరు ఎమ్మెల్యేలు అన్నట్లు సమాచారం. నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు తాము ఎందుకు పార్టీ మారుతున్నామో కూడా చెప్పే ప్రయత్నం చేయలేదని, దీంతో ఆయా నియోజకవర్గా ల్లో ప్రజలు ఆగ్రహంతో ఉన్నా రని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఫిరాయిం పు ఎమ్మెల్యేల సెగ్మెం ట్లలో ప్రజలకు కాం గ్రెస్‌‌‌‌ అంటే అభిమానం ఉందని, ఇతర ప్రాంతాల్లో కూడా సానుభూతి వ్యక్తమవుతోందని సమావేశంలో చర్చిం చారు. ప్రజలు, కార్యకర్తల మనోభావాలు గమనిం చి పార్టీ తక్షణం ఏదైనా కార్యక్రమం చేపట్టా లని, లేకపోతే అది నాయకత్వ తప్పిదం అవుతుం దని సీనియర్‌‌‌‌ నేత ఒకరు ప్రతిపాదిం చినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం లోక్‌‌‌‌సభ ఎన్నికల హడావిడి ఉన్నం దున పోలింగ్‌‌‌‌ ముగియగానే నిరసనలకు శ్రీకారం చుట్టా లని తీర్మానిం చినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయిం చిన ఎమ్మెల్యేల నియోజకవర్గా ల్లోని ముఖ్య కేంద్రాల్లో వరుస నిరసనలు చేపట్టా లని, పార్టీకి, నమ్మిన ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రలోభాలకు లొం గి పార్టీ మారారని, నియోజకవర్గ అభివృద్ధికి ఫిరాయిం పునకు ఎలాం టి సంబంధం లేదని కూడా ప్రజలకు విడమర్చి చెప్పాలని సీఎల్పీ భేటీలో చర్చిం చారు. లోక్‌‌‌‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నం దున ఈ నిరసన కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడతాయని కొందరు నేతలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలు కైవసం చేసుకునే దిశగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టా లని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కఠిన చర్యలే…..

పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేతలపై ప్రస్తుతం అనుసరిస్తున్న మెతక వైఖరి తగదని, వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని సీఎల్పీ సమావేశంలోకొం దరు ఎమ్మెల్యేలు సూచిం చినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయిస్తారని రోజుల తరబడి ప్రచారం జరుగుతున్నా పార్టీ తరఫున ఎలాం టి చర్యలు లేకపోవడంతో క్యాడర్‌‌‌‌లో కూడా అగ్ర నాయకత్వం పై తేలిక భావం ఏర్పడుతోం దని చర్చ జరిగినట్లు సమాచారం. పక్కా ఆధారాలుం టే తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం వల్ల క్యాడర్లో మనోస్థైర్యం పెరుగుతుం దని కొందరు సూచిం చినట్లు తెలిసింది. దాం తో నేతలు చేజారకుం డా కఠినంగా ఉండటమే సరైం దనే నిర్ణయానికి సీఎల్పీ వచ్చినట్లు సమాచారం. ఎక్కడ అనుమానం వచ్చినా సదరు నేతలతో సంప్రదిం పులు జరిపి, వారిని నిలువరిం చే ప్రయత్నం చేయాలని సమావేశంలో తీర్మానిం చారు.

ఎంపీ సీట్లపై గురి.. రాహుల్ సభలపై చర్చ…

లోక్‌‌‌‌సభ ఎన్నికల విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని సీఎల్పీ సమావేశంలో నేతలు సూచిం చినట్లు తెలిసింది. నిజామాబాద్‌ లో బ్యా లెట్‌‌‌‌ పద్ధతిలో పోలింగ్‌‌‌ ‌ జరుగుతున్నం దున దాన్ని వినియోగిం చుకొని పార్టీని గెలిపిం చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈవీఎం ట్యాంపరింగ్‌‌‌‌ అంశంపై కాం గ్రెస్‌‌‌‌ సాగిస్తున్న పోరుకు ఇది కలిసి వస్తుందని కొం దరు నేతలు అభిప్రాయపడ్డారు. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో కనీసం ఆరు సీట్లను గెలుచుకుంటా మనే ధీమాను సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. ఖమ్మం , నల్గొం డ, భువనగిరి, మల్కాజ్ గిరి, చేవెళ్ల, మహబూబాబాద్​లో పార్టీ విజయం సాధిస్తుందని వారు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఈ సెగ్మెం ట్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎలాం టి కార్యక్రమాలు చేపట్టా లో,పీసీసీ తరఫున అనుసరిం చాల్సిన వ్యూహంపై భేటీలోచర్చిం చారు. ఏప్రిల్‌‌‌‌ 1న రాష్ట్రం లో జరిగే ఏఐసీసీ చీఫ్ రాహుల్‌‌‌‌ సభను విజయవంతం చేసే అంశంపైనా సీఎల్పీ సమావేశంలో చర్చ జరిగిం ది. రాహుల్‌‌‌‌ రెం డో విడతగా రాష్ట్రానికి ఏప్రిల్‌‌‌‌ 8న వస్తున్నా రని, ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేస్తే బాగుంటుం దనే అంశం కూడా చర్చిం చారు. భువనగిరి, పెద్దపల్లిలో నిర్వహిస్తే బాగుంటుం దనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. వీలైతే మహబూబాబాద్‌ లో మూడో సభను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో ఉత్తమ్‌ మినహా ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, సీతక్క, రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, గండ్ర వెం కటరమణారెడ్డి, పోడెం వీరయ్య,జగ్గా రెడ్డితోపాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నా రు. నల్గొం డ ఎంపీ స్థానం నుం చి పోటీ చేస్తున్నందున ఉత్తమ్‌ ప్రచారంలో బిజీగా ఉన్నా రని, అందుకే రాలేదని సీఎల్పీ నేతలు తెలిపారు. కరీం నగర్ గ్రాడ్యుయేట్స్​ నియోజకవర్గం నుం చి ఎమ్మెల్సీ గా అత్యధిక మెజార్టీతో విజయం సాధిం చిన జీవన్ రెడ్డిని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సన్మానిం చారు.

Latest Updates