‘బాబ్రీ మసీదును కూల్చింది కాంగ్రెస్సే’

అయోధ్య: దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లంతా నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై బజరంగ్ దళ్ నేత, ఎంపీ వినయ్ కతియార్ స్పందించారు. 1992వ సంవత్సరం, డిసెంబర్ 5న బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలాంటి రహస్య పథకం వేయలేదని, కర సేవకు మాత్రమే ప్లాన్ చేశామని కతియార్ చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడాలనే కుట్రతో బాబ్రీ మసీదును కాంగ్రెస్ కూల్చివేసిందన్నారు. తామెప్పుడూ బాబ్రీని కూల్చాలని అనుకోలేదన్నారు. కల్యాణ్ సింగ్ సర్కార్‌‌ను పడగొట్టడంతోపాటు బాబ్రీ కూల్చివేత విషయంలో కాంగ్రెస్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌‌లో ఏ ఒక్క మసీదుపైనా ఎవ్వరూ చేయి వేయబోరన్నారు. శాంతియుత పరిస్థితులు ఇలాగే కొనసాగాలన్నారు.

Latest Updates