కాంగ్రెస్ చేసింది సర్జికల్ స్ట్రైక్స్ కాదు…వీడియోగేమ్ స్ట్రైక్స్

కాంగ్రెస్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ‘వీడియోగేమ్’ స్ట్రైక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ తమ ప్రభుత్వం లో ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేశామని లెక్కలు చెబుతోంది. మూడు సర్జికల్స్ట్రైక్స్ చేశామని ఆ పార్టీకి చెందిన నేత నాలుగు నెలల కిందటే చెప్పారు . ఇప్పుడది కాస్తా ఆరు అయ్యింది. ఎన్ని కలవగానే ఈ సంఖ్య 600 అవుతుంది” అని కాంగ్రెస్ నేతలనుద్దేశించిఅన్నారు. శుక్రవారం రాజస్థాన్ లోని కరౌలీ,సికర్, బికనేర్ లలో నిర్వహించిన ఎన్ని కల ప్రచారాల్లో మాట్లాడిన మోడీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ చెప్తున్నవన్నీ అబద్దాలే నని,యూపీఏ సర్జికల్ స్ట్రైక్స్ అన్నీ కాగితాల్లో మాత్రమేకనబడతాయని చెప్పారు . తాము సర్జికల్ స్ట్రైక్స్  చేయడాన్ని తొలుత ఖండించిన కాంగ్రెస్.. ఆతర్వాత వ్యతిరేకించింది.. ఇప్పుడు మీ టూ అంటోందని మోడీ దుయ్యబట్టారు.

టెర్రరిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే…

కాంగ్రెస్ ప్రభుత్వానికి టెర్రరిజాన్ని ఎదుర్కొ నేధైర్యం లేకపోయిందని మోడీ అన్నారు. అందుకేదేశం అవతల ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించిందని, 2009, 2014లో ఎన్నికల పేరు చెప్పి ఐపీఎల్ మ్యాచ్ లను దక్షిణాఫ్రికాకు తరలించిందని ఆరోపించారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవని, నిరాటంకంగా ఐపీఎల్, ఎన్నికలు జరుగుతున్నాయనిచెప్పారు . 2008లో యూపీ, గుజరాత్, ముంబై, రాజస్థాన్ లలో జరిగిన బాంబు దాడులకు..కాంగ్రెస్ బదులిచ్చిన తీరుకు ప్రస్థుత పరిస్థికి పోలికే లేదన్నారు.

సంబారాలు చేసుకోవాల్సింది పోయి…

జైషే చీఫ్ మసూద్ ను అంతర్జాతీ య ఉగ్రవాదిగా యూఎన్ గుర్తించడంపై సంబరాలు చేసుకోవాల్సింది పోయి..ఎన్ని కల సమయంలో ప్రకటిస్తారాఅని ప్రశ్ని స్తోందన్నారు. ‘మసూద్​ను ఇంటర్నేష నల్ టెర్రరిస్టుగా అనౌన్స్ చేసేముం దు.. మేడమ్,నామ్ దార్ లను అడిగేదుండెనా?’ అంటూసోనియా, రాహుల్ నుద్దేశించి ఎగతాళి చేశారు.దేశ భద్రతపై కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోందన్నారు. బాలాకోట్ పై సర్జికల్ స్ట్రైక్స్ తర్వాతే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని ఎదుర్కోవడంపైచర్చ జరిగిందని, మసూద్​ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా గుర్తించడం మరో సర్జికల్ స్ట్రైక్ అని అభివర్ణించారు. బలమైన ప్రభుత్వం ఉన్నప్పడే ఢోక్లాంవంటి ఘటనలు జరిగినప్పుడు సరైన నిర్ణాయాలు తీసుకుంటుం దన్నారు. ప్రస్తుతం ఇండియా శక్తివంతమైన దేశంగా మారిందని, రక్షణ దళాలు అధునాతన వెఫన్స్ కలిగి ఉన్నాయని చెప్పారు .సోలార్ ఎనర్జీ రంగంలోనూ దేశం దూసుకెళ్తోందన్నారు.

మోడీకి మళ్లీ క్లీన్ చిట్……

కాంగ్రెస్ మునుగుతున్న టైటానిక్ , న్యూ ఇండియా టెర్రరిజాన్ని ఏ మాత్రంసహించదు’ అంటూ నాం దేడ్, వారణాసి సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్లుమోడల్ కోడ్ ఉల్లంఘన కిందకు రావని ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీంతో ప్రధాని మోడీపైవచ్చిన ఐదు కంప్లైంట్లకు క్లీన్ చిట్ వచ్చినట్లు అయింది. రాజస్థాన్ లోని బార్మర్ లో ‘ఇండియాన్యూక్లియర్ బటన్ ను దీపావళికి వాడాలని తయారు చేసుకోలేదు’ అని రాజస్థా న్ లోని బార్మర్సభలో, ‘రాహుల్ మైనార్టీ లు ఎక్కువగా ఉన్న వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు’ అని మహారాష్ట్ర వార్ధ సభలో, ‘బాలాకోట్ హీరోలు, పుల్వామా అమరవీరులకు గుర్తుగా ఫస్ట్ టైం ఓటర్లు ఓటేయాలి’ అని మహారాష్ట్రలోని లాతూర్ లో మోడీ కామెంట్లు చేశారు. వీటిపై అందిన కంప్లైంట్స్ ను ఈసీ పూర్తి స్థాయి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చింది.

Latest Updates