కాంగ్రెస్ కు 10 సీట్లు: పొత్తుపై స్టాలిన్ ప్రకటన

చెన్నై: తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీల పొత్తు ఖరారైంది. సీట్ల పంపకంపై రెండు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. తమిళనాడులోని 39 సీట్లలో 9 చోట్ల కాంగ్రెస్ కు కేటాయించారు. పుదుచ్చేరిలోని ఏకైక ఎంపీ సీటులో కాంగ్రెస్ పోటీకి అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బుధవారం రాత్రి ప్రకటించారు. అయితే ఏయే సీట్లలో ఏ పార్టీ పోటీ చేస్తుందనే దానిపై రెండు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాసిక్ తో చర్చించి సీట్ల షేరింగ్ పై ఒక అంగీకారానికి వచ్చి ఈ ప్రకటన చేశారు స్టాలిన్.

అయితే తమిళనాడులో మిగిలిన 30 సీట్లలో 20 నుంచి 25 చోట్ల డీఎంకే పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వాటికి కేటాయిస్తారు.

బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన ఒక్క రోజులోనే ప్రతిపక్షం కూడా వెంటనే తమ అలయన్స్ ను ఖరారు చేసింది. సీట్ల పంపకంపై కూడా ఒక ఒప్పందానికి వచ్చింది.

Latest Updates