MPలో SC రిజర్వుడ్ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

హిందీ బెల్టులో కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో దళిత ఓటు బ్యాంకును కాపాడు కునేందుకు కాంగ్రెస్ కష్టపడుతున్నది. ఇక్కడి నాలుగు ఎస్పీరిజర్వుడ్‌ లోక్ సభ స్థానాల్లో పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకవైపు బీఎస్పీ చీఫ్ మాయావతి బెదిరింపులు, మరోవైపు బీజేపీ దూకుడుకు ధీటుగా వెళుతున్నది. ఎస్సీ రిజర్వుడు స్థానాలైన భింద్ , టికామ్ ఘర్ , దేవాస్ , ఉజ్జయిని స్థానాలను 2014లో బీజేపీ గెలుచుకుంది. కానీఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో , ఈ నాలుగులోక్ సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ బాగాపుంజుకుంది. ఈ ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 32అసెంబ్లీ స్థానాలకుగానూ 17 చోట్ల హస్తం గాలివీచింది. ఓడిపోయిన స్థానాల్లో నూ గణనీయస్థాయిలో ఓట్లు రాబట్టుకో గలిగింది. దీంతో అసెంబ్లీఎన్నికల ఊపుతో, పార్లమెంట్ సీట్లనూ కైవసం చేసుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ మాయావతి వార్నిం గ్ తో సీన్ రసవత్తరంగా మారింది. ఐదోదశలో భాగంగా టికామ్ ఘర్ లోక్ సభ నియోజక వర్గంలో మే 6న పోలింగ్ జరుగనుండగా, భింద్ స్థానంలో మే 12న, దేవాస్ , ఉజ్జయిని ల్లో మే 19నఎన్నికలు జరుగనున్నాయి .

మూల్యం చెల్లిం చకతప్పదు!

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వాని కి బయటినుంచి మద్దతిస్తోన్నప్పటి కీ లోక్ సభ ఎన్నికల్లోమాత్రం పొత్తు ఉండదని బీఎస్పీ చీఫ్ మాయావతిఎన్నికల ప్రారంభంలో నే ప్రకటించారు. అయితేఉమ్మడి శత్రువు బీజేపీని అడ్డుకునే క్రమంలో చాలాచోట్ల కాంగ్రెస్ –బీఎస్పీలు దాదాపు స్నే హపూర్వ-కంగా నే వ్యవహరిస్తున్నాయి . ప్రభావం చూపగల-మనుకున్న కొన్ని స్థానాల్లో మాత్రం హోరాహోరీగాతలపడుతున్నాయి . అలాంటి సీట్లలో గుణ లోక్సభ స్థానం కూడా ఒకటి. గుణలో బీఎస్పీ, లోకేంద్రసింగ్ రాజ్ పుత్ ను అభ్యర్థిగా నిలబెట్టిం ది. తీరానామినేషన్ వేసిన తర్వాత లోకేంద్ర సింగ్ కాంగ్రెస్లోకి జంప్ అయి, బీఎస్పీకి భారీ షాకిచ్చారు. ఈఘటనతో ఆగ్రహానికి గురైన మాయావతి, ‘‘గుణలోమీరు చేసిన ద్రోహానికి మిగతా చోట్ల భారీ మూల్యంచెల్లిం చుకోక తప్పదు’’అంటూ కాంగ్రెస్ కు స్ట్రాం గ్వార్నిం గ్ ఇచ్చారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్అ భ్య-ర్థిగా మధ్యప్ర-దేశ్ డిప్యూటీసీఎం, వెస్ట్​ యూపీ ఎ న్ని-కల ఇన్ చార్జిజ్యోతి రాది త్యసింధియా పోటీచేస్తుస్తున్న సంగతితెలిసిందే.

రంగంలోకి దళిత ప్రముఖులు

మాయావతి వార్నింగ్ తో హైరానా పడ్డ కాంగ్రెస్ పార్టీ, దళిత ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అదే వర్గాని కి చెందిన ప్రముఖుల్ని రంగంలోకి దించింది. ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్​ జాతీయ అధ్యక్షుడు ఉదిత్ రాజ్ తో పా టు దళిత నాయకులుగా జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన కొందరితో మధ్యప్రదేశ్ లో ఎన్నికలప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీఅయింది. మధ్యప్రదేశ్ లో బీఎస్పీకి దాదాపు 7శాతం ఓటు బ్యాంకు ఉంది. మొన్నటి అసెంబ్లీఎన్నికల్లో ఆ పార్టీ తరఫు న ఇద్దరు ,సమాజ్వాది తరఫున ఒక్కరు ఎమ్మెల్యేలుగా గెలిచారు.దాదాపు అన్ని ఎస్సీరిజర్వు డు అసెంబ్లీ స్థానాల్లో నూదళిత ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పటికీ, మాయ వార్నిం గ్ఎలాంటి ఎఫెక్ట్​ చూపిస్తుందోనన్న భయం హస్తం పార్టీ నేతల్నివెంటా డు తోంది. ఇక బీజేపీ తనసొంత బలానికి తోడు ప్రతిపక్షాల అనైక్యత కూడా కలిసొస్తుందని ఆశిస్తున్నది.

Latest Updates