కర్నాటక బైపోల్‌‌లో కాంగ్రెస్ ప్లాన్స్ పని చేయవు

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్‌‌తో కలసి జనతాదళ్ (సెక్యులర్) కొంతకాలం ప్రభుత్వాన్ని నడిపింది. కానీ విడిపోయినప్పటి నుంచి ఈ రెండు మిత్ర పక్షాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌‌లో అసెంబ్లీ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీఎస్ లీడర్, మాజీ కర్నాటక మాజీ సీఎం హెచ్‌‌డీ కుమారస్వామి కాంగ్రెస్‌‌పై విరుచుకుపడ్డారు. ‘ఆర్‌‌ఆర్ నగర్‌‌లో ఈసారి కాంగ్రెస్ ఎత్తుగడ పని చేయదు. ఇక్కడ రెండుసార్లు నెగ్గిన కాంగ్రెస్.. నియోజకవర్గం కోసం ఏమీ చేయలేదు. అలాంటప్పుడు వాళ్లు ఓటర్లను ఎలా ఎదుర్కొంటారు? కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకోవాలని జేడీఎస్ కోరుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ దగ్గరకు మేం వెళ్లలేదు. కాంగ్రెస్ నేతలే హెచ్‌‌డీ దేవె గౌడ వద్దకు వచ్చారు’ అని కుమారస్వామి పేర్కొన్నారు.

Latest Updates