గెలిపిస్తే అసోంకు ప్రత్యేక హోదా : ప్రియాంక గాంధీ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ జోరుగా జనంలోకి వెళుతున్నారు. అసోం రాష్ట్రంలోని సిల్చార్ నియోజకవర్గంలో ఆమె రోడ్ షో నిర్వహించారు. ప్రియాంక గాంధీ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రియాంక. ఐదేళ్ల మోడీ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. అసోంకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక హోదాను బీజేపీ తొలగించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అసోంకు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.

Latest Updates