60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

ఢిల్లీ: రిటైర్ అయ్యే వయసులో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు కాంగ్రెస్ సీనియర్ లీడర్. 60 ఏళ్ల వయసులో లేటు మ్యారేజ్ చేసుకుని తన దాంపత్య జీవితాన్ని స్టార్ట్ చేశాడు. మహారాష్ట్రకు చెందిన మాజీ కేంద్రమంత్రి ముకుల్ హస్నిక్(60) తాజాగా పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితురాలైన రవీనా ఖురానాను ఢిల్లీలో పెళ్లాడారు. ఈ పెళ్లికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసినప్పుడు అధ్యక్షుడిగా ముకుల్ పేరు కూడా వినిపించిందని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. వాస్నిక్‌ దంపతులకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌తో, మనీష్‌ తివారీ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Latest Updates