మిషన్ యూపీ : లక్నోలో అన్నతో ప్రియాంక భారీ రోడ్ షో

Congress General Secretary of east UP priyanka gandhi’s roadshow in Lucknow

Congress General Secretary of east UP priyanka gandhi’s roadshow in Lucknowకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్ పర్యటన మొదలైంది. ఈ రోజు (11/02/19) ఆమె లక్నోలో రోడ్ షో ప్రారంభించారు. తన అన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాధిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్, పార్టీ సీనియర్ నేతలు రోడ్ షోలో పాల్గొంటున్నారు. నయా ఉమీద్ నయా దేశ్ పేరుతో యూపీ పర్యటన చేపట్టారు ప్రియాంక. దారి పొడవునా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రియాంక.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్ తూర్పు ఉత్తరప్రదేశ్ పార్టీ ఇన్ ఛార్జ్ గా ప్రియాంక నియమితులయ్యాక… మొదటిసారి లక్నోలో అడుగుపెట్టారు ప్రియాంక. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఆమె పర్యటించనున్నారు. మీ అందరినీ కలిసేందుకు నేను లక్నో వస్తున్నాను. మనమంతా కలసి కొత్త రాజకీయాలు ప్రారంభిద్దాం. ఆ రాజకీయాల్లో మీరంతా భాగస్వాములు కావాలి. అందరి గొంతు వినిపించాలంటూ నిన్న ఆడియో మెసేజ్ ఇచ్చారు ప్రియాంక.

Latest Updates