2009లో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చింది కాంగ్రెస్సే

యురేనియం తవ్వకాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అంశంపై అవకాశవాద రాజకీయం చేస్తోందని ఆరోపించారు. యురేనియం అన్వేషణకు TRS అనుమతిచ్చిందని, అప్పుడు అనుమతిచ్చి, ఇప్పుడు ఇందుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తోందన్నారు.

కేంద్రం అనుమతిచ్చింది యురేనియం అన్వేషణకు మాత్రమేనని, దేశ ఖనిజ సంపదపై డేటా బేస్ తయారు చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఖనిజ సంపదపై పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయని, యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలకన్నా, బొగ్గు తవ్వకాలతోనే ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు.

Latest Updates