రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

కేటీఆర్ ఫాంహౌస్‌పై రేవంత్ పోరాటం పర్సనల్

కాంగ్రెస్‌‌కు ఎలాంటి సంబంధం లేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్‌పై ఎంపీ రేవంత్ రెడ్డి పోరాటం ఆయన వ్యక్తిగతమని, దానితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడి అక్రమ నిర్మాణాలపై రేవంత్‌‌ పార్టీలో చర్చించలేదన్నారు. ఏ నాయకుడు, ఏ పోరాటం చేసినా ముందుగా పార్టీలో చర్చించాలని సూచించారు. 111 జీవో వల్ల అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి దాన్ని ఎత్తేయాలని తాను డిమాండ్‌‌ చేస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్, పెరి అర్బన్ జోన్, కన్జర్వేషన్ జోన్, గ్రీన్ జోన్ కూడా ఎత్తేయాలన్నారు. తమలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా శత్రువుపై పోరాటానికి అందరం ఒక్కటవుతామని చెప్పా రు. రేవంత్ మీద కేసైనా, తనపై పాస్ పోర్ట్ కేసైనా వ్యక్తిగతమేనని పేర్కొన్నారు. అది పార్టీకి రుద్దడం తప్పన్నారు.

Latest Updates