‘ఢిల్లీ’ ఓటమితో కాంగ్రెస్​లో లొల్లి

    రిజల్ట్స్ తర్వాత బయటపడ్డ తేడాలు

    షీలా దీక్షిత్​పై చాకో పరోక్ష కామెంట్స్​

    తప్పుపట్టిన మిలింద్​ దేవరా

     చిదంబరం, శర్మిష్ఠ ముఖర్జీ మధ్య ట్వీట్ల వార్​

ఢిల్లీ అసెంబ్లీ  ఎలక్షన్​ రిజల్ట్స్​ కాంగ్రెస్​లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ ఓటమిపై ఫలితాలు  రిలీజైన  మరుసటి రోజే కాంగ్రెస్​నాయకులు ఒకర్నొకరు బహిరంగంగా తిట్టుకోవడం మొదలుపెట్టారు.  బీజేపీని ఓడించడానికి  ఇతరులకు ‘ఔట్​ సోర్స్’ గా పార్టీ పనిచేసిందా అంటూ  మాటల యుద్ధాన్ని  ప్రారంభించారు. సీఎం షీలా దీక్షిత్ వల్లే పార్టీ పతనం మొదలైందంటూ చాకో చేసిన పరోక్ష విమర్శలు పార్టీలో దుమారం లేపాయి.​ “2013 నుంచి పార్టీ పతనం మొదలైంది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎలక్షన్లలోనూ పార్టీ ఓడిపోయింది.  కాంగ్రెస్​ ఓటు​బ్యాంక్​ కొత్త పార్టీ ఆప్ వైపు వెళ్లింది” దీక్షిత్ పేరు చెప్పకుండా  ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్​ ఓటమిపై చాకో  వివరణ ఇచ్చారు.చాకో కామెంట్స్​పై కాంగ్రెస్​ లీడర్​మిలింద్​ దేవరా సీరియస్​ అయ్యారు. “షీలా మంచి అడ్మినిస్ట్రేటర్. గొప్ప పొలిటీషియన్.​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆమె ఢిల్లీ రూపురేఖలను మార్చేశారు.  కాంగ్రెస్​ ఎప్పుడూ లేనంత బలంగా ఉండేది.  చనిపోయిన తర్వాత ఆమెను నిందించడం దురదృష్టకరం. కాంగ్రెస్​ పార్టీకి, ఢిల్లీ ప్రజలకు ఆమె జీవితాన్ని అంకితం చేశారు”అని మిలింద్​ వివరించారు.మిలింద్​ దేవరా ఎటాక్స్​తో చాకో వివరణ ఇచ్చారు. తాను షీలా దీక్షిత్​పేరు చెప్పలేదని, తాను అన్నదాన్ని తప్పుగా అర్థంచేసుకుని.. తనకు వ్యతిరేకంగా  క్యాంపెయిన్​ మొదలు పెట్టారని  క్లారిఫికేషన్​ ఇచ్చారు. “షీలాజీ పేరును నేను ప్రస్తావించలేదు. 15 ఏళ్ల కాంగ్రెస్​ పాలనలో  అన్నిరంగాల్లో ఢిల్లీ అభివృద్ధికి, మంచి పాలన అందించడానికి ఆమె ఎంతగానో కృషిచేశారు ”అని చాకో  చెప్పారు.

షీలా దీక్షిత్​కు ఒకప్పటి సహాయకుడిగా ఉన్న పవన్​ఖెరా కూడా చాకో వ్యాఖ్యలపై రియాక్ట్​ అయ్యారు. ‘‘2013లో ఓడిపోయినప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్​ ఓటు షేరు 24.55 ఉండేది.  షీలా దీక్షిత్​కు 2015 తో సంబంధంలేకపోయినప్పటికీ అప్పుడు ఓటు షేరు 9.7కి పడిపోయింది”అని పవన్​ ఖెరా చెప్పారు. “ఒకరి విజయానికి మరొకరు గర్వపడతారు. సొంత పార్టీ ఓడిపోయినా కూడా’’ అని శశిథరూర్​ఉర్దూ పద్యాన్ని కోట్​చేస్తూ ట్వీట్​ చేశారు. “కాంగ్రెస్​ పార్టీకి ఢిల్లీ రిజల్ట్స్​నిరుత్సాహాన్ని కలిగించాయి. అయితే ‘‘విభజన రాజకీయాలు”చేసిన బీజేపీ తుడిచిపెట్టుకుపోవడంతో కొంత రిలీఫ్​ కలిగింది. లోక్​సభ ఎన్నికల్లో క్లీన్​స్వీప్​ చేసిన 8 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో వారు తుడిచిపెట్టుకుపోయారు”అని  థరూర్​ మరొక ట్వీట్​చేశారు.

మన దుకాణాలను మూసేద్దామా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఆప్ ను పొగడ్తలతో ముంచెత్తిన మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరంపై కాంగ్రెస్​ లీడర్​, ​మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌‌‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సీరియస్​గా రియాక్ట్​ అయ్యారు. ‘చిదంబరంజీ.. బీజేపీని ఓడించే పనిని రీజినల్​ పార్టీలకు కాంగ్రెస్‌‌‌‌ పార్టీ అప్పగించిందా?. లేకపోతే పార్టీ ఓటమిని పక్కనపెట్టి ఆప్‌‌‌‌  గెలుపుపై మనం సంబరాలు జరుపుకోవడం ఏంటి.? నా ప్రశ్నకు అవునంటే.. మనం ఇక పీసీసీ దుకాణాలను మూసేద్దాం’అని శర్మిష్ఠ సీరియన్​ కామెంట్స్​చేశారు. మంగళవారం ఢిల్లీ ఎలక్షన్​ రిజల్ట్స్​వచ్చిన వెంటనే ఆప్​ గెలుపును వెల్​కమ్​ చెబుతూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ట్వీట్​చేశారు. ‘‘ఢిల్లీలో ఉండే అన్ని రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఓడించారు. విభజన పాలిటిక్స్,  ప్రమాదకర బీజేపీ అజెండాను ప్రజలు  ఓడించారు.  2021, 2022లో ఎన్నికలు జరగనున్న  పలు రాష్ట్రాలకు  బెస్ట్​ ఎగ్జాంపుల్​గా నిలిచిన ఢిల్లీ ప్రజలకు సెల్యూట్​ చేస్తున్నాను ”అని  చిదంబరం ట్వీట్‌‌‌‌ చేశారు.

చాకో రాజీనామా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇంఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు.  ఆయన రాజీనామాను ఆమోదించిన సోనియా..  చాకో ప్లేస్​లో టెంపరరీ ఇన్​చార్జ్​గా శక్తి సిన్హా గోహిల్​ను నియమించారు.

Latest Updates